కొన్ని పరిణామాల వల్ల మహిళలు చీరలు ధరిస్తున్నారు : సీనియర్ నటుడు నరేశ్
ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల వల్ల సినిమా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే మహిళలు చీరకట్టులో వస్తున్నారంటూ సీనియర్ నటుడు నరేశ్ అన్నారు. కొన్ని నెలల క్రితం నటుడు శివాజీ ఓ సినిమా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి నరేశ్ పై విధంగా కామెంట్స్ చేశారు.
సుహాస్ హీరోగా గోపి తెరకెక్కించిన చిత్రం 'హే భగవాన్'. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుక తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగింది. ఇందులో పాల్గొన్న నరేశ్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల తర్వాత సినిమా వేడుకల్లో చాలామంది మహిళలు చీరల్లోనే కనిపిస్తున్నారని అన్నారు. అలా ఉండటం భారతీయ సంప్రదాయం అని వ్యాఖ్యానించారు.
కాగా, వాలంటైన్ వీక్‌లో భాగమైన హగ్ డే సందర్భంగా నరేశ్ వేదికపై ఉన్న పురుషులను హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న హీరోయిన్ శివానీ, యాంకర్ స్రవంతిల వద్దకు వెళ్లిన నరేశ్ మాట్లాడుతూ, మిమ్మల్ని కూడా ఆలింగనం చేయాలని వచ్చాను. కానీ మీరు లక్షణంగా చీరలు ధరించి వచ్చారు. కొన్ని పరిణామాల వల్ల చాలా మంది సినిమా వేడుకలకు చీరలు ధరించి వస్తున్నారు అని అన్నారు.