Sharwanand: ముసుగు యోధుడిగా భోగి టీజర్ లో కనిపించనున్న శర్వానంద్
Updated: Sat, 3 Oct 2026 (10:08 IST)
Sharwanand's Bhogi poster
దర్శకుడు సంపత్ నంది, కథానాయకుడు శర్వానంద్ చేస్తున్న సినిమా భోగి. శర్వాసంపత్ బ్లడ్ ఫెస్ట్.. అనే హ్యాష్‌ట్యాగ్ తో 'భారీ' రక్తపాతం ఉంటుందని హామీ ఇస్తూ ముసుగుయోదుడుగా పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర టీమ్. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో భోగి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని 1960ల నాటి ఒక కల్పిత గ్రామంలో జరుగుతుంది.
ఇందులో శర్వానంద్, ఐదుగురు సోదరీమణులున్న గంగ పాత్రలో నటించగా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ఆయనతో పాటు నటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం, భారీ క్లైమాక్స్ చిత్రీకరణ తర్వాత అదనపు విఎఫ్ఎక్స్ కోసం ఆగస్టు 28, 2026న జరగాల్సిన తన విడుదలను వాయిదా వేసుకుంది. పోస్టర్లు నిప్పురవ్వలు మరియు ఎడారి దృశ్యాలతో కూడిన యాక్షన్ వైబ్స్‌ను ప్రదర్శిస్తున్నాయి.
సినిమా కథ, శర్వానంద్ పాత్ర, యాక్షన్ ఎలిమెంట్స్‌కు సంబంధించిన వివరాలను చిత్ర బృందం పూర్తిగా వెల్లడించకపోయినా.. టైటిల్, కాంబినేషన్ చూస్తుంటే సినిమా మాస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ విడుదల తేదీని ప్రకటించడం ద్వారా మేకర్స్ సినిమాపై హైప్‌ను మరింత పెంచారు.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి