Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్
Sharwanand in a mass look
హీరో శర్వానంద్ తాజా చిత్రం భోగి కోసం పూర్తి స్థాయిలో మాస్ అవతారమెత్తారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి మాస్ లుక్ ను నేడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. చెమటతో కూడిన అవతారంలో సీరియస్ చూస్తే నోటిలో బీడీ తాగుతూ తీక్షణంగా చూస్తున్న ఈ లుక్ ను నేడు శర్వానంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. గంగ అనే పాత్రలో నటిస్తున్నారు.
గంగను కలవండి - నిశ్శబ్దంలో జన్మించిన తుఫాను, విస్ఫోటనం కోసం వేచి ఉన్న కోపం. ప్రపంచం త్వరలో భోగిలో అతని కోపాన్ని చూస్తుంది. ఆగస్టు 28, 2026 నుండి సినిమాల్లో.తెలుసుకోండని చిత్ర టీమ్ ట్వీట్ చేసింది. ఒకవైపు బైకర్ సినిమానూ మరోవైపు భోగి సినిమాను చేసి ఈ ఏడాది రెండు సినిమాలు విడుదలకు నోచుకుంటున్నారు.
కథాపరంగా చూస్తే, 1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా. శర్వా తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా మాస్ లుక్ లో సర్ప్రైజ్ చేశారు. ఇటీవలే సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీగా నారి నారి నడుమ మురారితో వచ్చిన శర్వా ఈసారి భోగి కి వారం ముందు, ఆగస్టు 21న ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ ప్లాన్ చేశారు. రెండో వారంలో నాని సినిమాతో శర్వా మూవీకి కాస్త పోటీ ఉండే అవకాశం ఉంది. భోగి హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లో శర్వా కనిపించనున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా పలు ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.