శ్రుతిహాసన్ బాగా ఖర్చు చేస్తుందట..షాపింగ్ అంటే ఇష్టమట.. చెన్నై వరదలకి..?

shruti haasan
Selvi| Last Updated: సోమవారం, 7 డిశెంబరు 2015 (15:11 IST)
శ్రుతిహాసన్ బాగా ఖర్చు చేస్తుందట. షాపింగ్ అంటే తెగ ఇష్టపడే ఈ భామ చెన్నై వరద బాధితులు ఎంత మొత్తం ఇచ్చిందో లేదో తెలియట్లేదు. కానీ వరుస ట్వీట్లతో వరద బాధితులను ఆదుకోండి ట్వీట్ చేస్తూనే ఉంది. తనకు ఇష్టమైన వాటిని కొనడంలో ఏమాత్రం రాజీ పడని ఈ భామ.. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్ని పరిశీలిస్తూ, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఆభరణాలు, వస్త్రాలు మొదలైనవి కొనుగోలు చేస్తుందట.

అలాగే తాను కూడా షాపింగ్‌ను ఎక్కువగానే చేస్తుంటానని శ్రుతిహాసన్ చెబుతోంది. తనకి జీన్స్ - టీషర్ట్ అంటే చాలా ఇష్టమనీ, అలాగే తనకి బాగా ఉంటాయని అనిపించిన ఇతర డ్రెస్‌లను కూడా కొంటూ ఉంటానని, డ్రస్సుకు తగిన స్లిప్పర్స్ ఉండి తీరాల్సిందేనని చెప్తోంది. అయితే చెన్నైలో వరదలు ముంచెత్తిన తరుణంలో శ్రుతిహాసన్ నగదు విరాళం ఇచ్చినట్లు ఎక్కడా వార్తలు వినిపించట్లేదు. కోట్లు కోట్లు ఖర్చు పెట్టే హీరోహీరోయిన్లకు వరద బాధితులకు కాసింత ఇచ్చేందుకైనాదీనిపై మరింత చదవండి :