1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sing Geetham is the film audiences embraced after 'Mahanati': Nag Ashwin

Nag Ashwin: మహానటి తర్వాత ప్రేక్షకులు ఓన్ చేసుకున్న సినిమా సింగ్ గీతం: నాగ్ అశ్విన్

Nag Ashwin, Devisri, anil ravipudi and team
Nag Ashwin, Devisri, anil ravipudi and team
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ 'సింగ్ గీతం'. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోనమై ఈ చిత్రం ప్రేక్షకులు విమర్శకులు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గోల్డెన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు.
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా చూశాను. చాలా బాగుంది. చాలా వెరైటీగా ఉంది. చాలా హార్ట్ టచింగ్‌గా ఉంది. కానీ నాకు లోలోపల ఒక ఫీలింగ్ వచ్చింది. మనం ఒక సినిమా తీసి, చాలా కష్టపడి ట్రైలర్ కట్ చేసి రిలీజ్ చేస్తుంటాం. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ట్రైలర్ లేకుండానే సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. అది నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. నేనూ కూడా ట్రైలర్ లేకుండా అందంగా ప్రమోట్ చేసి సినిమా చేయాలని ఉంది. సింగీతం గారు తీసిన ప్రతి సినిమా ఒక ల్యాండ్‌మార్క్. ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవద్వీపం... ఆయన చేసిన ప్రతి సినిమా ప్రత్యేకమైన మైలురాయి. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి.

సింగీతం గారు దాదాపు ఏడు సంవత్సరాల క్రితమే నాకు ఈ సినిమా ఆలోచన చెప్పారు. ఆయన కథ చెప్పిన తర్వాత చాలామంది నిర్మాతలను కలిశాను. కానీ అది ఎక్కడా మెటీరియలైజ్ కాలేదు. ఈ అద్భుతమైన ఆలోచన వెనుక ఎవరైనా నిలబడితే బాగుంటుందని అనిపించేది. కొన్ని సంవత్సరాల తర్వాత అది నాగ్ అశ్విన్ రూపంలో సాధ్యమైంది. సింగీతం గారి నుంచి మరో ల్యాండ్‌మార్క్ సినిమాను ప్రేక్షకులకు అందించిన నాగ్ అశ్విన్ గారికి, వైజయంతి మూవీస్‌కు హ్యాట్సాఫ్. సింగీతం గారు వెంటనే మరో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. అవకాశం వస్తే ఆయన టీమ్‌లో నేను కూడా పనిచేయాలని ఉంది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకు అందించిన సంగీతానికి ప్రత్యేకంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇది ఆయన కెరీర్‌లోనే బెస్ట్ వర్క్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. టీం అందరికీ అభినందనలు
 
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఎప్పటినుంచో ఒక మంచి మ్యూజికల్ సినిమా చేయాలని ఉండేది. మనం ఏదైనా బలంగా కోరుకుంటే యూనివర్స్ కూడా ఆ కోరికకు అనుకూలంగా పనిచేస్తుంది. అందుకే సింగ్ గీతం చేసే అవకాశం వచ్చింది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఇది ఆయన 40 ఏళ్ల కల. అలాంటి కలలో మేము భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. మనిషి ఆశ కూడా చాలా అందంగా ఉండాలి. చాలామంది ఆశలు కలిసి ఉంటే దేవుడు వాటిని తప్పకుండా నెరవేర్చుతాడు. ఈరోజు ఈ సెలబ్రేషన్ జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్ గారు. నిజంగా ఆయన నిర్మాత కాకపోయి ఉంటే ఈ సినిమా, ఈ వేడుక ఉండేవి కావు. సింగీతం గారు దర్శకుడిగా ఉంటే, నాగ్ అశ్విన్ గారు ఆయన కలను నిజం చేసిన వ్యక్తి. చాలా సినిమాలు బ్లాక్‌బస్టర్ అవుతాయి. మంచి డబ్బులు, పేరు తీసుకొస్తాయి. కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఒక క్రియేటర్‌కు నిజమైన సంతృప్తిని ఇస్తాయి. అలాంటి బిగ్గెస్ట్ మ్యూజికల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా సింగ్ గీతం. ఈ సినిమాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మమ్మల్ని ఎంతో ఇన్‌స్పైర్ చేసిన సింగీతం గారికి థాంక్యూ. 94 ఏళ్ల వయసులో కూడా ఆయనలో ఉన్న ఫైర్‌కు మనందరం హ్యాట్సాఫ్ చెప్పాలి. జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన దర్శకుడు అయినప్పటికీ, ఆయన ఆలోచనల్లో, ప్యాషన్‌లో ఉన్న అగ్ని ఏమాత్రం తగ్గలేదు. ఈ సినిమాకు సంబంధించిన సంగీతం విషయంలో నాకు వచ్చిన క్రెడిట్ అంతా మా గురువుగారు మండోలిన్ శ్రీనివాస్ గారికి అంకితం చేస్తున్నాను. అలాగే మా అమ్మగారికి, మా నాన్నగారికి అంకితం చేస్తున్నాను. వైజయంతి మూవీస్, అశ్వినీ దత్ గారి బ్యానర్‌లో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.  
 
నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. సావిత్రి గారి గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు తొలిసారి సింగీతం గారిని కలిశాను. మాయాబజార్ సినిమాకు పనిచేసిన ఆయన, సావిత్రి గారిని డైరెక్ట్ చేసిన దర్శకుడు, ఆదిత్య 369 తీసిన లెజెండరీ ఫిల్మ్‌మేకర్. అలాంటి ఆయనను ఒకసారి కలవడమే జీవితాంతం గుర్తుండిపోయే మెమరీ అనుకున్నాను. కానీ ఆ జర్నీ ఇంతదూరం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన కలకు తెరరూపం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాను మేమెప్పుడూ తీయలేదు. ఈ సినిమా చేస్తూనే ఇలాంటి సినిమా ఎలా తీయాలో నేర్చుకుని మరీ తీశాం. 
 
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ గారే సంగీత దర్శకుడిగా సరైన ఎంపిక అని సింగీతం గారే చెప్పారు. ఇలాంటి సినిమా ప్రపంచంలో ఎవరూ చేయలేదని సింగీతం గారు చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. కానీ సినిమా పూర్తయ్యాక అది నిజమే అనిపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు తామే పాటలు పాడారు. అహల్య, శాలిని, అయాన్ అందరూ అద్భుతంగా కుదిరారు. నివేదా, రాహుల్ ఎపిసోడ్ నాకు చాలా ఇష్టం. ప్రతి సినిమాకు ప్రేక్షకుల్లో ఒక సందేహం ఉంటుంది. కానీ ఒకసారి మంచి మౌత్ టాక్ వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఆ సినిమాను తమదిగా చేసుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ థియేటర్లకు వస్తున్నారు. 
 
మహానటి తర్వాత ప్రేక్షకులు ఇంతగా ఓన్ చేసుకున్న సినిమా ఇదే. అది సింగీతం గారి గొప్పతనం. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరి నిజాయితీ తెరపై కనిపించింది. అలాంటి మ్యాజిక్‌ను ప్లాన్ చేసి చేయలేం. సింగ్ గీతంకు రెండో దర్శకుడిగా చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారి పేరు చెప్పాలి. ప్రతి పాత్రకు ఆయన సంగీతం అద్భుతంగా కుదిరింది. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. అలాగే ఈ సినిమాకు మరో దర్శకుడు సంకల్ప్. 94 ఏళ్ల దర్శకుడు, 24 ఏళ్ల దర్శకుడు కలిసి ఒక అందమైన మ్యాజిక్‌ను సృష్టించారు.
About Writer
దేవీ