1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Spirit the film produced by a shepherdess, is getting ready

Spirit: గొర్రెలు కాచుకునే మహిళ నిర్మించిన సినిమా స్పిరిట్ సిద్ధమవుతోంది

Narsamma, C.H. Ravikumar, Venkateswarlu, V. Samudra, Ashok Kumar, Producer Ram Das
Narsamma, C.H. Ravikumar, Venkateswarlu, V. Samudra, Ashok Kumar, Producer Ram Das
8th వండర్ సినిమా బ్యానర్ పై రవిబాబు సత్య ప్రకాష్, చిత్రం శీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్, సుజాత, మయూరి, డాలి నటీనటులుగా సిహెచ్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో ఒక గొర్రెలు కాచుకునే భార్య భర్తల అయిన చిన్నబోయిన రైతు నర్సమ్మ వెంకటేశ్వర్లు కలిసి నిర్మించిన చిత్రం స్పిరిట్. 
 
వీరికి చదువు రాకపోయినా ఆర్టిస్టులను పెట్టుకుని తన కొడుకుతో తీసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో వేడుకను హైదరాబాదులో ఘనంగా విడుదల చేశారు ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు వి.సముద్ర, నటులు నిర్మాత అశోక్ కుమార్, నిర్మాత రామ్ దాస్   తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. 
 
అనంతరం నటుడు నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ : మనసులో భయం ఉంటే అది స్పిరిట్ గా ఉంటుంది.. అది లేకపోతే మనల్ని చూసి స్పిరిట్ పారిపోతుంది. కాబట్టి భయపడకుండా ఉండాలి ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఉంటాడు ఆయన వెళ్ళిపోతే మనం పడిపోతాం కాబట్టి ఏ స్పిరిట్ ఏమి చేయలేదు.కానీ తెలియక ఏవో భయాలతో వెళ్తుంటాము ఎప్పుడైతే నిర్భయంగా ఉంటామో అప్పుడు ఏదైనా సాధించగలము. దానికి నర్సమ్మ నిదర్శనం.గొర్రెలు కాచుకునే నర్సమ్మ సినిమా నుంచి ఇన్కమ్ వస్తుందా రాదా అని ఆలోచించకుండా తన కొడుకుతో సినిమా చేయాలనే పట్టుదలతో ఈ సినిమా తీసింది. ఆమెకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 
 
దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. స్పిరిట్ అనగానే ప్రభాస్ చేస్తున్న టైటిల్ గుర్తొస్తుంది. అంత మంచి టైటిల్ తో చేస్తున్న నరసమ్మ గారు చేస్తున్న  స్పిరిట్ అనే సినిమా ఈ రోజున వాళ్ళలో మొదలైంది కాదు అందరిలాగా కోట్లు పెట్టుకొని వచ్చి ఈ సినిమాకి తీయలేదు.సినిమా తీయాలి అనే కోరికతో వచ్చి తను అమ్మవారిని నమ్ముకుని ఈ సినిమాని తీసింది.అమ్మవారే కాపాడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆవిడ తన కుటుంబంకోసం కష్టపడ్డ ప్రతి రూపాయి తిరిగి రావాలి.ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ప్రజలందరూ ఇది వాళ్ళ సినిమాగా భావించి ఈ సినిమాని గొప్ప ఘనవిజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 
 
నిర్మాత రామ్ దాస్  మాట్లాడుతూ..రైతులైన నర్సమ్మ, వెంకటేశ్వర్లు లు సినిమా తీసి మా దగ్గరకు వచ్చారు. కొడుకు నాతో మా అమ్మ కూలి పని చేసి కోటి రూపాయలతో సినిమా చేశాము అని చెపితే ఆశ్చర్యపోయి వాళ్ల మాటలకు నేను బెండ్ అయ్యాను. నేను చాలామంది గొప్ప వారిని చూశాను కానీ గత 25 ఏళ్లలో ఒక కూలి పని చేసి సినిమా తీసిన వారిలో గత  నేను నరసమ్మను మాత్రమే చూశాను అలాంటి డేరింగ్  డాషింగ్ నరసమ్మకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అలాగే తన ఊరిలో ఉన్న థియేటర్లో సినిమాతో పాటు తను పెట్టిన డబ్బులు రిటన్ వచ్చేలా చూస్తామని తెలియజేస్తూ ఈ సినిమాను ప్రేక్షకులందరూ పెద్ద మనసు చేసుకొని ఆమె పడిన కష్టాన్ని వృధా కానివ్వకుండా ప్రజలందరూ ఆదరించి ఆశీర్వదించి సినిమాను పెద్ద విజయం వైపు నడిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
 
చిత్ర నిర్మాతలు చిన్నబోయిన రైతు నర్సమ్మ, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ : ఈరోజు నేను ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను నాకున్న గొర్రెలను అన్ని   అమ్ముకొని  సినిమా తీశాము.అందరూ నన్ను ఎగతాళి చేసినా కూడా నేను పట్టించుకోలేదు. నా కష్టం చూసిన వారు మాత్రం నాకు ఫుల్ముం సపోర్ట్దు చేశారు. ఇది నా ఒక్కరిది కాదు అందరి సినిమా. మనం అందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 
 
చిత్ర దర్శకుడు సి. హెచ్. రవీంద్రనాథ్ మాట్లాడుతూ. అందరికీ తల్లిదండ్రులు జన్మనిస్తే నాకు మాత్రం జన్మతో పాటు మా పెద్దలు జీవితాన్ని కూడా ఇచ్చారు అది నేను జీవితాంతం మర్చిపోలేను ఈ సినిమా చాలా బాగా వచ్చింది అందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 
 
నటీనటులు : రవిబాబు సత్య ప్రకాష్, చిత్రం శీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్, సుజాత, మయూరి, డాలి  తదితరులు 
About Writer
దేవీ
తర్వాతి కథనం
Chiranjeevi Photo shoot:ఫస్ట్ లుక్ గా మెగాస్టార్ చిరంజీవి వెనుకభాగాన్ని చూపించిన బాబీ కొల్లి