ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఆసక్తికర సన్నివేశాలు.. మహేష్ క్లారిటీ (video)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈనెల 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల ఒక అనుకోని వివాదంలో చిక్కుకుంది. నటుడు మహేష్ వైపు శ్రీలీల సీరియస్‌గా చూసిన వీడియో వైరల్ కావడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది.
అయితే, దీనిపై మహేష్ స్పందించారు. శ్రీలీల తన ఫోన్‌ను తన వద్దే ఉంచారు. ఫోన్ కోసమే తన వైపు చూస్తున్నారేమోనని అనుకున్నానని... కానీ ఆమె స్క్రీన్ మీద ఏదో చూస్తూ వెంటనే అటు తిరిగిపోయారని మహేష్ క్లారిటీ ఇచ్చారు.
అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ హీరోయిన్లు శ్రీలీల, రాశిఖన్నాలతో యాంకర్ సుమ చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సినిమాల్లోని డైలాగ్స్ చెప్పమని అడగగా.. ఇద్దరూ తమదైన శైలిలో చెప్పి అలరించారు.