క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్... సోషల్ మీడియాలో పుకార్లు
టాలీవుడ్ నటి శ్రీలీల భారత క్రికెట్ జట్టు క్రికెటర్ తిలక్ వర్మతో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలీల సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా, వీరిద్దరూ ఇంతవరకు కలుసుకోలేదని వివరణ ఇస్తున్నాయి. అలాగే, శ్రీలీల తల్లి డాక్టర్ సరస్వతి కూడా ఈ వార్తలను కొట్టిపారేశారు. ఈ పుకార్లలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
ఇదే అంశంపై శ్రీలీలకు చెందిన సన్నిహిత వర్గాలు స్పందిస్తూ, శ్రీలీల, తిలక్ వర్మ మధ్య సంబంధం ఉందన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. అసత్యం. పైగా, వాళ్లిద్దరూ ఇప్పటివరకు కనీసం ఒకరినొకరు కలుసుకోలేదు. మాట్లాడుకోలేదు కూడా అని పేర్కొన్నాయి. ఎలాంటి అధారాలు లేకుండా ఇలాంటి కల్పిత కథలను ప్రచారం చేయండ భావ్యం కాదని హితవు పలికాయి.
ఇదిలావుంటే, ఈ పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయంటే... వేర్వేరు సందర్భాల్లో ఆలయాలు, ఇతర కార్యక్రమాలలో వారిద్దరూ కనిపించారు. వాటిని ముడిపెడుతూ కొన్ని ఫ్యాన్ పేజీలు, గాసిప్ అకౌంట్లు కట్టు కథలు అల్లేశాయి. అయితే, ఈ ఘటనలకు వారి మధ్య వ్యక్తిగత సంబంధానికి ఎటువంటి సంబంధం లేదని తేలింది. ఇక శ్రీలీల విషయానికి వస్తే దక్షిణ, ఉత్తరాది చిత్ర సీమల్లో దూసుకెళుతున్నారు.
