మంగళవారం, 21 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026 (18:47 IST)

Srivishnu: విష్ణు విన్యాసం లో శ్రీ విష్ణు, నయన సారిక ల లవ్లీ కెమిస్ట్రీ

Sri Vishnu, Nayana Sarika
Sri Vishnu, Nayana Sarika
శ్రీ విష్ణు 'విష్ణు విన్యాసం' అనే యూనిక్ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతి రావు ఈ చిత్రానికి దర్శకత్వం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రాన్ని హేమ, షాలిని సమర్పిస్తున్నారు, సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామచారి ఎం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ 'దేఖో విష్ణు విన్యాసం'కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ మొదలే మొదలే సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు రధన్ ఈ సాంగ్ ని బ్యూటీఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం లవ్ ఫీలింగ్ ని అందంగా ప్రజెంట్ చేసింది. మధుశ్రీ, నరేష్ అయ్యర్ వోకల్స్ మరింత మెలోడీని యాడ్ చేశాయి.
 
ఈ సాంగ్ లో శ్రీ విష్ణు, నయన సారిక కెమిస్ట్రీ లవ్లీగా ఆకట్టుకుంది. వాలెంటైన్స్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ గా నిలిచే ఈ సాంగ్  ఇన్‌స్టంట్ హిట్‌గా అలరిస్తోంది.
 
ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని,  గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందించగా, ఎ. రమణాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్, కార్తికేయన్ రోహిణి  ఎడిటర్
 
ఈ చిత్రాన్ని త్వరలోనే  థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
తారాగణం: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ