ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2026 (19:01 IST)

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Ajay Bhupathi at Tirupati schdule
Ajay Bhupathi at Tirupati schdule
RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిర్మాత పి కిరణ్ నిర్మిస్తున్న శ్రీనివాస మంగాపురం ఇప్పటికే విడుదలైన టైటిల్ రివీల్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్ల  ఆసక్తిని రేకెత్తించాయి.
 
ఇటీవల చిత్రబృందం తిరుపతిలో జరిగిన కీలకమైన మూడో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని తదితర ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తవడంతో సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. ప్రస్తుతం చిత్ర నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. మేకర్స్ భారీ స్థాయిలో ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.
 
టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సంగీతాన్ని జివి ప్రకాశ్ కుమార్ సమకూరుస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ ISC, ఎడిటింగ్ బాధ్యతలను మాధవ్ కుమార్ గుల్లపాటి నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్. హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
 
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
నటీనటులు: జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తాడాని, మోహన్ బాబు