1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sudigali Sudheer's G O A T makes the youth think: Producer

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ (గోట్) యువతను ఆలోజింపచేస్తుంది : నిర్మాత

Sudigali Sudheer, Divya Bharathi
Sudigali Sudheer, Divya Bharathi
సుడిగాలి సుధీర్ హీరోగా దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం G.O.A.T  (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. వేదవ్యాస్‌ దర్శకుడు.   మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ సమర్పణలో ఈ చిత్రం నవంబరు 12న థియేట్రికల్‌ విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
నిర్మాత మాట్లాడుతూ  ప్ర‌స్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్  కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది.  సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం  అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.  
సుడిగాలి సుధీర్‌, దివ్యభారతి, సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
 
ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, నేపథ్య సంగీతం: మణిశర్మ,  డీఓపీ: ర‌సూల్ ఎల్లోర్‌, ఆడిషనల్‌ డీఓపీ: సన్నీ కూరపాటి, ఎడిటర్‌: విజయ్‌ ముక్తవరపు,  ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ : రాజీవ్ నాయర్, , కో ప్రొడ్యూస‌ర్‌: సమైరా రెడ్డి.ఎన్‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ప్ర‌సూన మండ‌వ‌, దర్శకత్వం: వేదవ్యాస్‌, నిర్మాత: చంద్రశేఖర్‌ మొగుళ్ళ
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Raviteja: రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తులాబారం రాబోతుందా ?