Sukumar: జపనీస్ అభిమానుల ప్రేమలేఖలతో చలించిపోయిన సుకుమార్
ఇక్కడ సంక్రాంతి, జపాన్లో వారి పండుగ రోజున పుష్ప 2 జపాన్ భాషలో విడుదలయింది. 16వ తేదీన విడుదలైంది. ఈ సందర్భంగా సుకుమార్ కు అక్కడి ఫాన్స్ ప్రేమలేఖలు రాసారు. డానికి అయిపోయాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జపనీస్ అభిమానులు రాసిన ప్రేమలేఖలతో చలించిపోయి, సినిమాకు సరిహద్దులు లేవని, కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయని సుకుమార్ అన్నారు.
సుకుమార్ తను చదువుతున్నలేఖలతో పోస్ట్ చేస్తూ, "జపాన్ నుండి వచ్చిన లేఖలను చదువుతున్నాను...ఇది నిజంగా వినయపూర్వకమైన అనుభూతి! సినిమాకు సరిహద్దులు లేవు, కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. కథలు చెప్పడాన్ని నేను ఎందుకు ప్రేమించానో మీ మాటలు నాకు గుర్తు చేస్తున్నాయి. భాషకు, దూరానికి అతీతమైన ఈ అనుబంధానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. అరిగటో గొజాయిమాసు, జపాన్." జనవరి 16న జపాన్‌లో 'పుష్ప కున్రిన్' పేరుతో హౌస్‌ఫుల్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. జపాన్‌కు వెళ్లిన నటుడు అల్లు అర్జున్‌కు జపనీస్ అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది.
అంతకుముందు, జపాన్‌లో ఈ చిత్ర పంపిణీదారులు అయిన గీక్ పిక్చర్స్ ఇండియా, తమ ఎక్స్ (గతంలో ట్విట్టర్) టైమ్‌లైన్‌లో ఇలా ప్రకటించారు, "'కొన్నిచివా, నిహోన్ నో టోమో యో' భారతీయ సినిమా ఇండస్ట్రీ హిట్ పూర్తి స్థాయిలో జపాన్‌లోకి దూసుకువచ్చింది! పుష్ప రాజ్ జనవరి 16, 2026న జపాన్‌ను స్వాధీనం చేసుకుంటున్నాడు, ఈ కార్చిచ్చును సరిహద్దులు మరియు సముద్రాలు దాటించి తీసుకువెళ్తున్నాడు. #Pushpa2inJapan #Pushpa2TheRule #PushpaKunrin #WildFirePushpa." అన్నారు