ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ పై చిల్డ్రన్ మూవీగా సమ్మర్ హాలిడేస్
Dheeraj Mogilineni- Summer Holidays poster
చిల్డ్రన్ మూవీగా నిర్మించిన "సమ్మర్ హాలిడేస్" సినిమా టైటిల్ ను ఈ రోజు అనౌన్స్ చేశారు. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్ కీలక పాత్రల్లో నటించారు. రోహన్ రాయ్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి హిట్ చిత్రాల్లో నటించి బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మాస్టర్ అరుణ్ 35 చిన్న కథ కాదు సినిమాతో ఫేమ్ అయ్యారు. వీళ్లిద్దరికీ "సమ్మర్ హాలిడేస్" మూవీ మరింత పేరు తీసుకురానుంది. మే 1 "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఒక ఇంట్రెస్టింగ్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోనుంది.
నటీనటులు - రోహన్ రాయ్, అరుణ్, తదితరులు
టెక్నికల్ టీమ్- డీవోపీ - సాయి ప్రకాశ్, మ్యూజిక్ డైరెక్టర్ - సింజిత్ యెర్రమల్లి, స్టోరీ, డైరెక్టర్ - శ్రీకర్
