1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Tamil Nadu CM Vijay dances to Megastar Chiranjeevi-s Indra Veena song, Video viral

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Vijay Veena song dance
ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకె ఘన విజయం సాధించడం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం తెలిసిన విషయమే. ఈ నేపధ్యంలో విజయ్‌కి సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ ఇంద్ర చిత్రంలోని వీణ పాటకు తమిళ నటుడు జోసెఫ్ విజయ్ స్టెప్పులు వేయడం కనబడుతోంది. విజయ్ అలా డ్యాన్స్ చేస్తుండగా ఆ నృత్యాన్ని చిరంజీవితో పాటు పవన్ కల్యాణ్, మహేష్ బాబు వీక్షిస్తున్నట్లు వీడియో వున్నది. మొత్తమ్మీద మెగా ఫ్యాన్స్ చరిత్రను తిరగేసి కష్టపడి వెతికి పట్టుకుని ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు కనబడుతోంది. ఇలా చిరు వీణపాట మరోసారి సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ