Tammareddy Bharadwaja: నానీస్ పేరడైజ్ చిత్రాన్ని విమర్శించిన వారిని ఘాటుగా శపించిన తమ్మారెడ్డి భరద్వాజ
Thammareddy Bharadwaja
ఇక ఇదిలా వుండగా, పారడైజ్ సినిమా గురించి ఆయన అభిప్రాయం.. ఇలా వుంది. ప్యారడైజ్ సినిమా కొంతమందికి నచ్చింది చాలా మందికి నచ్చలేదు అది వేరే విషయం...కానీ organised negativity (వ్యవస్థీకృత ప్రతికూలత) అయితే జరిగింది. ఎప్పుడూ లేనంత గెగెటివిటీ జర్నలిస్టుల్లో చాలామంది 1/5లు ఇచ్చారు, నెగెటివ్ వీడియోలు చేశారు. ఇలా చేసినవాళ్లు పురుగులు పట్టి పోతారు - డైరెక్ట్‌గానే చెప్తున్నా" అంటూ ఘంటా పదంగా శపించేవారు.
మరి దీనికి మీడియా ఏమంటుందో త్వరలో తెలియాల్సి వుంది. ఆయన చెబుతున్న వ్యవస్థీకృత ప్రతికూలత ఎక్కడనుంచి వచ్చింది. ప్రచారకర్తలుగా వుండే వారే చేశారా? వారినుద్దేశించి అన్నారా? అన్నది తెలియాల్సివుంది.
ఇక సినిమాలో హింస మామూలుగా లేదు. కొన్ని సీన్లు కానీ డైలాగ్ లు కానీ వినకూడనివి బీబ్ లు ఇస్తారు సెన్సార్ బోర్డ్ వారు. కానీ అవేవీలేదు. అంటే వ్యవస్థీకృత ప్రతికూలత అనే సెన్సార్ నుంచే వచ్చిందా? వారి నిర్ణయం తప్పా? సెన్సార్ విషయంలో తప్పు చేశారా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇక సినిమాలో హీరో తల్లి వ్యభిచారిణి అని అందుకే నువ్వు లంజకొడుకు.. అంటూ విలన్ వర్గీయులు డైలాగ్ లుచెబుతారు. తండ్రెవరో తెలీని నువ్వు లంచకొడుకు విరా అంటూ హీరో చేతిపైనే పచ్చబొట్టు పొడుస్తారు. ఇలా చెప్పుకుపోతే చాలానే వున్నాయి. కానీ 2026లో కూడా ఇలాంటి డైలాగ్ లు సీన్లు మితిమీరిన హింస అవసరమా? అని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

