సోమవారం, 16 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 6 ఫిబ్రవరి 2026 (17:07 IST)

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Mirayi - tejsajja
Mirayi - tejsajja
సూపర్ హీరో తేజసజ్జా 'మిరాయ్' జైత్రయాత్ర కొనసాగిస్తోంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం, ఓటీటీ, ఇప్పుడు టెలివిజన్‌లోనూ సంచలన రికార్డులు సృష్టిస్తూ అరుదైన ఘనతను సాధించింది.
 
కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, People Media Factory బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన మిరాయ్ ఫాంటసీ, ఎమోషన్, యాక్షన్‌ తో థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అనంతరం Hotstar ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి భారీ వ్యూయర్‌షిప్‌ను దక్కించుకుంది.
 
ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌తో మరో మైలురాయిని అందుకుంది. Star Maa లో ప్రసారమైన మిరాయ్ టీవీ ప్రీమియర్‌కు 9.1+ TRP నమోదవ్వగా, గరిష్టంగా 10.80 TRP పీక్ రేటింగ్‌ను అందుకుంది. 2026లో ఇప్పటివరకు ఏ సినిమాకు లభించని అత్యధిక టీఆర్‌పీగా ఇది రికార్డ్ అయింది. ఓటీటీ రిలీజ్‌ల కారణంగా టీవీ వ్యూయర్‌షిప్ తగ్గుతున్న ఈ రోజుల్లో మిరాయ్ అద్భుతం చేసింది. 
 
మిరాయ్ హిందీ వెర్షన్ కూడా 2025లో Star Gold లో ప్రసారమైన టాప్ రేటెడ్ చిత్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగా సినిమాకు వచ్చిన ఈ స్పందన, సీక్వెల్‌పై ఆసక్తి, డిమాండ్‌ను మరింత పెంచింది.
 
థియేటర్లు, ఓటీటీ, శాటిలైట్.. మూడు మాధ్యమాల్లోనూ ఘన విజయాలు సాధించిన మిరాయ్, తేజ సజ్జాను భారతీయ సినిమా పరిశ్రమలో మోస్ట్ ప్రామెసింగ్ యంగ్ స్టార్ గా నిలబెట్టింది.