సంబంధిత వార్తలు
- కలెక్షన్ నంబర్లలో ఒక చిత్ర విజయాన్ని నిర్ణయించలేం : రామ్ చరణ్
- ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు
- 'దేశీ ప్రిన్సెస్'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ
- పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు
'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు
మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 'పెద్ది' చిత్రం సినిమా టిక్కెట్ ధరలను తాత్కాలికంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేశారు. ఈ నిర్ణయంతో సినిమా విడుదలకు ముందు చిత్ర బృందానికి పెద్ద ప్రోత్సాహం లభించినట్లయింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రేపు (జూన్ 4వ తేదీన) ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రానికి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. జూన్ 4 నుంచి 13వ తేదీ వరకు ఈ పెంపు అమల్లో ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్‌పై అదనంగా రూ.100, మల్టీప్లెక్స్‌లలో ప్రతి టికెట్‌పై రూ.125 (జీఎతో కలిపి) పెంచుకోవచ్చు. ఈ 10 రోజుల కాలపరిమితి ముగిసిన తర్వాత ధరలు తిరిగి సాధారణ స్థాయికి వస్తాయి. రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది.
అభిమానుల కోసం బుధవారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక షోలు ప్రదర్శించనున్నారు. ఈ స్పెషల్ షో టికెట్ ధరను జీఎస్టతో కలిపి రూ.600గా నిర్ణయించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల పెంపునకు ఇదే విధమైన జీవో ఇవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బుధవారం రాత్రి నుంచే 'పెద్ద' ప్రీమియర్ షోల సందడి ప్రారంభం కానుంది.
ఈ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని ఫిల్మ్ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం ఒక ముఖ్యమైన అంశం. తాజా అనుమతులతో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
