1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Tharun Bhascker and Manasa Chaudhary song premaku pulihora song mix.

ప్రేమకి పులిహోర కలిపుకుంటున్న తరుణ్ భాస్కర్, మానస చౌదరి

Tharun Bhascker, Manasa Choudhary
Tharun Bhascker, Manasa Choudhary
తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించ బోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఎంటర్టైనింగ్ ట్రైజర్, పాటలతో స్ట్రాంగ్ బజ్ సృష్టించింది. ఇప్పుడు మేకర్స్ ఫోర్త్ సింగిల్ ప్రేమకి పులిహోర రిలీజ్ చేశారు.
 
టిపికల్ లవ్ సాంగ్‌లా కాకుండా, ‘ప్రేమకి పులిహోర’ మోడరన్ లవ్ లో ఉండే అటుపోటులు, సరదా, అన్నీ అంశాలను సరదాగా ప్రజెంట్ చేస్తోంది. తనకు నచ్చిన అమ్మాయిని ఆకట్టుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు, ఆ ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులు అన్నీ ఈ పాటలో హ్యూమరస్‌గా, రిలేటబుల్‌గా ఆకట్టుకున్నాయి. 
 
స్వీకర్ అగస్తి ఈ పాటకు లైట్, బ్రీజీ ఫీల్‌తో కూడిన ట్యూన్ అందించారు. మెలోడీకి అర్బన్ టచ్ జోడించి, స్టైలిష్ మ్యూజిక్‌తో ఈ పాటను క్యాచీగా తీర్చిదిద్దారు. ఆయన రాసిన పదాలు నేటి ప్రేమలో ఉండే కన్ఫ్యూజన్, ఎగ్జైట్మెంట్‌ను చక్కగా చూపించాయి. అనురాగ్ కులకర్ణి వోకల్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.
 
తరుణ్ భాస్కర్, మానస చౌదరి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. వారి మధ్య జరిగే క్యూట్, సరదా క్షణాలు, స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కలిసి ఈ పాటను మరింత ఎంజాయబుల్‌గా మార్చాయి.
 
ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషదం ఎడిటింగ్‌, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్‌, సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందిస్తున్నారు. 
 
గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 
 
తారాగణం: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, తదితరులు
 
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్
సమర్పణ: పవన్ సాదినేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్
బ్యానర్లు: సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్టూడియోస్
DoP: విద్యా సాగర్ చింత
సంగీతం: స్వీకర్ అగస్తీ
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ప్రొడక్షన్ డిజైనర్: చంద్రిక గొర్రెపాటి
కథ: సూర్య ప్రకాష్ జ్యోసుల
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీని జోస్యుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పెన్మత్స అజయ్ వర్మ
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
Vfx & టైటిల్ యానిమేషన్: ఎగ్ వైట్
పబ్లిసిటీ డిజైన్: ఎల్లోటూత్స్
About Writer
దేవీ
తర్వాతి కథనం
Dhanush: కరసామిగా ధ‌నుష్ పోరాటం ఎవరిపైనే తెలియాలంటే టీజర్ చూడాల్సిందే