సోమవారం, 16 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 20 జనవరి 2026 (16:47 IST)

Modi: 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ప్రధాని మోదీ బయోపిక్ మా వందే

Unni Mukundan, K.K. Senthil Kumar and others
Unni Mukundan, K.K. Senthil Kumar and others
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను "మా వందే" టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్.

ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా "మా వందే" సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందుతోంది. "మా వందే" చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ రిలీజ్ చేయనున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశం "మా వందే" చిత్రంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది.
 
"మా వందే" సినిమాను సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ 400 కోట్ల రూపాయలకు పైగా హ్యూజ్ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ స్టోరీ డ్రివెన్ మూవీని ప్రపంచంలో తొలిసారిగా తొలిసారి ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్ తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆక్వామ్యాన్ లో హీరోగా నటించిన జేసన్ మమొవాను "మా వందే" చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ వంటి పేరున్న యాక్టర్స్ ఫస్ట్ సిట్టింగ్ లోనే కథ నచ్చి మూవీ చేసేందుకు అంగీకరించారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఓ మామూలు బయోపిక్ లా కాకుండా చలనచిత్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా "మా వందే" నిర్మాణవుతోంది. ప్రీ ప్రొడక్షన్ కే మూడేళ్ల సమయం తీసుకోవడం చూస్తే ఈ సినిమా కోసం మేకర్స్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో అర్థమవుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న "మా వందే" సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెల 22వ తేదీ నుంచి కాశ్మీర్ లో ప్రారంభం కా నుంది.
  నటీనటులు - ఉన్ని ముకుందన్, రవీనా టండన్, జగపతి బాబు, శరత్ కుమార్, తదితరులు
 
టెక్నికల్ టీమ్ --  యాక్షన్ - కింగ్ సోలొమన్,  ప్రొడక్షన్ డిజైనర్ - సాబు సిరిల్, ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్,  డీవోపీ - కె.కె. సెంథిల్ కుమార్
మ్యూజిక్ - రవి బస్రుర్,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - గంధాధర్ ఎన్ఎస్, వాణిశ్రీ .బి.
లైన్ ప్రొడ్యూసర్ - టీవీఎన్ రాజేశ్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
మార్కెటింగ్ - వాల్స్ అండ్ ట్రెండ్స్
నిర్మాత - వీర్ రెడ్డి.ఎం.
రచన, దర్శకత్వం - క్రాంతికుమార్.సి.హెచ్.