1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The country's first reality show, 'Big Picture', has launched.

The Big Picture: దేశవ్యాప్తం గా తొలి రియాలిటీ షో బిగ్ పిచ్చర్ ప్రారంభం

image
The inaugural reality show -The Big Picture
హైదరాబాద్, ఏప్రిల్ 17, 2026: భారత వినోద రంగానికి కొత్త దిశను చూపించే అడుగుగా గ్యామెన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘బిగ్ పిచ్చర్’ పేరుతో వినూత్న పాన్ ఇండియా రియాలిటీ షోను ప్రారంభించింది. సినిమా నిర్మాణ బాధ్యతలను నేరుగా ప్రేక్షకుల చేతుల్లో ఉంచే ఈ కార్యక్రమం త్వరలో జియోహాట్స్టార్ వేదికగా ఐదు భాషల్లో ప్రసారం కానుంది. “ఇప్పటివరకు సినిమాలకు మీరు తీర్పు చెప్పారు... ఇక మీరు ఒక సినిమా తీయండి” అనే సవాల్తో దేశవ్యాప్తం గా ప్రేక్షకులను ఈ షో ఆహ్వానిస్తోంది.
 
ఒక్క నిమిషంలోనే సినిమాలపై తీర్పులు వెలువడుతున్న ఈ కాలంలో ‘బిగ్ పిచ్చర్’ 15 వారాల ప్రయాణంగా ప్రేక్షకులను రచయితలు, దర్శకులు, నటులు, నిర్ణయాధికారులుగా మార్చే వేదికగా నిలుస్తోం ది. ప్రేక్షకుల అభిప్రాయం మరియు సినిమా నిర్మాణంలోని కఠిన వాస్తవాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిం చడమే ఈ కార్యక్రమ లక్ష్యం . చివరికి ప్రజల చేతులతో రూపొందిన చిత్రం దేశవ్యాప్తం గా
థియేటర్లలో విడుదల కావడం ప్రత్యేక ఆకర్షణ.
 
ఈ కార్యక్రమం పారదర్శకతతో పాటు ఉత్కంఠను పెంచే రెండు కీలక భాగాలపై నిర్మితమైంది:  స్టార్బోర్డ్: వేలాది కథా ఆలోచనలు, ఆడిషన్లు, సంగీత సృష్టులను ఒకేచోట చూపించే విస్తృ త డిజిటల్ వేదిక. మదర్బోర్డ్: ఉత్తమ ఎంపికలను నిర్ణయించే కేంద్రం గా ప్రారంభమై, క్రమంగా తుది సినిమాకి  రూపరేఖలను ఆవిష్కరించే వేదికగామారుతుంది.
 
గ్యామెన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మాత రవ్ మాట్లాడుతూ...“ప్రతి శుక్రవారం సంవత్సరాల కష్టాన్ని కొన్ని రేటింగ్ స్టార్లతోనే పరిమితం చేస్తున్నారు. ‘బిగ్ పిచ్చర్’తో ఆ ధోరణిని మార్చాలని మేము భావిస్తున్నాం. కెమెరా వెనుక ఉన్న బాధ్యత, కథపై ఉండే ఒత్తిడిని ప్రేక్షకులు అనుభవించాలి. ఇది కేవలం ఒక షో కాదు... సృజనాత్మకతపై అవగాహన పెంచే ఉద్యమం. దేశంలో
 
దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే మా లక్ష్యం . ‘మదర్బోర్డ్’ నుంచి తుది ఫలితం ఎలా ఉంటుందో
చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని తెలిపారు. 15 వారాల పాటు సాగే ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం 60 నిమిషాల ఎపిసోడ్గా ప్రసారం కానుంది. ప్రతి వారం విభిన్న దశలుగా కథనం ముందుకు సాగుతుంది. చివరి ఎపిసోడ్లో విజేతలను ప్రకటించిన
అనంతరం, వారు అందరూ కలిసి దేశవ్యాప్తం గా ప్రేక్షకులను ఆకట్టుకునే ఫీచర్ ఫిల్మ్ను  రూపొందించనున్నారు.
 
బిగ్ పిచ్చర్’కు ఐదు భాషల్లో ఐదుగురు నటులు హోస్ట్లుగా వ్యవహరించనున్నారు. నవదీప్, భరత్,  ఇంద్రజిత్ సుకుమారన్, వశిష్ఠ ఎన్. సింహ, విజయ్ రాజ్లు ఈ షోను ముందుకు తీసుకెళ్తారు. జియోహాట్స్టార్లో ప్రసారం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో పాల్గొనడానికి అవకాశం
కల్పించనున్నారు.
 
నవదీప్, తెలుగు వెర్షన్ హోస్ట్ మాట్లాడుతూ...“తెలుగు సినిమాకు ఎప్పటినుంచో ప్రాణం పోసేది.  ప్రేక్షకులే. సినిమాలను చూసే వారు మాత్రమే కాకుండా, వాటిని జీవించే అభిమానులు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు తొలిసారి వారు గ్యాలరీలో కూర్చునే వారు కాదు... దర్శకుడి కుర్చీలో కూర్చునే అవకాశం పొందుతున్నారు. ఈ ప్రయాణంలో తెలుగు భాగాన్ని ముందుండి నడిపించడం నాకు ఎంతో
ఆనందంగా ఉంది. మన స్థానిక ప్రతిభ విమర్శకుల నుంచి సృష్టికర్తలుగా మారే క్షణాలను చూడాలని  ఆసక్తిగా ఉన్నాను. సినిమా తీయడం కూడా సినిమా లాగే ఉత్కంఠభరితమని దేశానికి చూపించే సమయం వచ్చింది” అని అన్నారు.
రచయితలు, నటులు, సాంకేతిక నిపుణులు, సంగీత విద్వాంసులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అధికారిక వెబ్సైట్ http://www.bigpitchure.in ద్వారా లేదా ‘బిగ్ పిచ్చర్’ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని నమోదు చేసుకోవచ్చు.
About Writer
దేవీ