1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The film Aasman Meghamsh Srihari as the lead, has commenced with a thriller concept

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

Meghamsh Srihari, Sai Durga Tej, Niharika Konidela and others
Meghamsh Srihari, Sai Durga Tej, Niharika Konidela and others
మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఆస్మాన్ మూవీని కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. రామ్ నందన్ దర్శకత్వం వహించనున్నారు. శనివారం నాడు రామానాయుడు స్టూడియోలో జరిగిన పూజా కార్యక్రమానికి సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ స్విచ్ ఆన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ని అందించగా.. తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు.
 
అనంతరం మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ, నా ‘ఆస్మాన్’ సినిమా ప్రారంభోత్సవంకి వచ్చిన సాయి అన్నకి, నిహారిక అక్కకి, సందీప్ అన్నకి అందరికీ థాంక్స్. నిర్మాతలు వెంకటేష్, శ్రీకాంత్ గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. రామ్ నందన్ ఓ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నాం. మిగిలిన వివరాలు మున్ముందు ప్రకటిస్తామ’ని అన్నారు.
 
డైరెక్టర్ రామ్ నందన్ మాట్లాడుతూ, తెలుగులో నాకు ‘ఆస్మాన్’ తొలి అవకాశం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్, శ్రీకాంత్ కు థాంక్స్. మేఘాంశ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. మూడు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేస్తాం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌తో రాబోతోన్నాం. ఇది చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నారు.
 
నిర్మాత శ్రీకాంత్ మన్నెం మాట్లాడుతూ, మా శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా ఈ నూతన చిత్రం నా బ్రదర్ వెంకటేష్‌తో కలిసి  నిర్మిస్తున్నాను. మేఘాంశ్ శ్రీహరితో మా తొలి సినిమాని చేస్తుండటం ఆనందంగా ఉంది. రామ్ నందన్ ‘ఆస్మాన్’ అంటూ అద్భుతమైన కథతో సినిమాని తెరకెక్కించనున్నారు’ అని అన్నారు.
 
నిర్మాత వెంకటేష్ కొండారు మాట్లాడుతూ, కోడి రామకృష్ణ స్టూడెంట్ అయిన రామ్ నందన్ మాకు ఈ కథను ఏడాది క్రితం చెప్పారు. ఆయన ఇది వరకే అరబిక్‌లో సినిమా చేశారు. ఇక రామ్ నందన్ చెప్పిన కథకి మేఘాంశ్ సెట్ అవుతారని మేం ఆయన్ను సంప్రదించాం. మేఘాంశ్ గారికి కథ చాలా నచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్‌గా ఈ చిత్రం రాబోతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామ’ని అన్నారు.
 
శోయభ్ మాట్లాడుతూ, నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్ గారు, శ్రీకాంత్ గార్లకు థాంక్స్. మేఘాంశ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
తర్వాతి కథనం
Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్