Pooja Hegde: క్లాస్‌మేట్స్ దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కథగా శ్రీ శ్రీ చిత్రం
Dulquer Salmaan, Pooja Hegde
ఈ సినిమాకు 'శ్రీ శ్రీ' అనే ఆహ్లాదకరమైన టైటిల్ ఖరారు చేశారు. దీనికి "లవ్ విల్ స్పార్క్ అగైన్" అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్ ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఇద్దరూ ఒక కాంపౌండ్ గోడపై కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. పాస్టెల్ బ్లూ షర్ట్, గ్రే ట్రౌజర్, కళ్లద్దాలతో కనిపిస్తున్న దుల్కర్ సిగ్గరించిన చిరునవ్వుతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తే, లైట్ బ్లూ సల్వార్ సూట్‌లో ఉన్న పూజా హెగ్డే అతని వైపు చూసి మనసారా నవ్వుతూ కనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ పోస్టర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వారి దుస్తులు, హావభావాలను బట్టి ఇద్దరూ క్లాస్‌మేట్స్‌గా కనిపిస్తుండగా, పోస్టర్‌లోని సింపుల్ బ్యాక్‌డ్రాప్ అమాయకత్వం, నాస్టాల్జియా, మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. వారి రిలాక్స్‌డ్ బాడీ లాంగ్వేజ్, సహజమైన చిరునవ్వులు స్నేహం, అనుబంధం, మాటల్లో చెప్పలేని ప్రేమతో నిండిన బంధాన్ని సూచిస్తున్నాయి.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కొత్తదనాన్ని, పాజిటివ్ వైబ్స్‌ను పంచుతూ, దుల్కర్ సల్మాన్-పూజా హెగ్డే జోడీతో ప్రేక్షకులకు మనసును హత్తుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నామని హామీ ఇస్తోంది.
ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురి ప్రతిభతో చిత్రం విజువల్‌గా ఎమోషనల్ గా అద్భుతంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు.
