ఆదివారం, 15 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 11 ఫిబ్రవరి 2026 (19:02 IST)

Chiranjeevi: పునాదిరాళ్లు సినిమా కోసం కెమెరా ముందు నిలిచిన తొలి రోజు

Punadi Rallu - Chiranjeevi
Punadi Rallu - Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగంలో తొలిరోజును గుర్తుచేసుకుంటూ ఈ ఏడాది కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి.
 
ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి.
 
ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. కొణిదెల శివ శంకర వర ప్రసాద్ అనే నేను ఒకరోజున తెలుగు తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఏలుతాను అని.. తన మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన రోజు. మరి ఇప్పుడు మెగాస్టార్ అదే రోజుని సోషల్ మీడియాలో ఎంతో ప్రత్యేకంగా పంచుకున్నారు.
 
సరిగ్గా నేడు ఫిబ్రవరి 11నే తాను తన మొదటి సినిమాకి కెమెరా ముందుకు వచ్చిన రోజు అని పలు ఫోటోలు తాను షేర్ చేసుకొని మురిసిపోయారు. నిన్ననే జరిగిందా అనే రకమైన అనుభూతి అదంతా ఒక అందమైన చందమామ కథ లాంటిది నాకు అని ఆ జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. దీనితో తన పోస్ట్ మరియు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులలో వైరల్ గా మారాయి.