1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The Manga Manga song from Srinivasa Mangapuram launched by Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

Jayakrishna Ghattamaneni, Rasha Thadani
Jayakrishna Ghattamaneni, Rasha Thadani
‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమౌతున్న జయకృష్ణ ఘట్టమనేని తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న ఆయన ఆ అంచనాలకు తగ్గట్టుగానే తన ప్రామిస్‌ను నిలబెట్టుకుంటున్నారు.

‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’విజువల్‌గా అద్భుతమైన, వైలెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్ ‘అలెల్లే అలెల్లే’ కేవలం రెండు వారాల్లోనే 4.6 మిలియన్ వ్యూస్ సాధించి ట్రెండింగ్ హిట్‌గా నిలిచింది. తాజాగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘మంగా మంగా’ సాంగ్ ను విడుదల చేశారు. దర్శకుడు అజయ్ భూపతి విజన్‌కు తగ్గట్టుగా ఈ పాట యూత్‌ఫుల్ ఎనర్జీతో సినిమాకి మరింత కలర్ తీసుకొచ్చింది.

ఈ పాటలో జయకృష్ణ, రాషాను ఇష్టపడి… తిరుపతిలోనే ఉండిపోవాలని కోరుకుంటూ, తనని జీవిత భాగస్వామిగా అంగీకరించమని సరదాగా ఆటపట్టించే విధంగా కనిపించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ జివి ప్రకాశ్ కుమార్ ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ అందించారు.

పర్కషన్ బీట్స్, వాడిన వాద్యాలు ఈ పాటను మరింత ఎనర్జిటిక్‌గా, ఫన్‌గా మార్చాయి. వినగానే ఆకట్టుకునే ఈ ట్యూన్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. జయకృష్ణ, రాషా మధ్య కనిపించే స్పార్క్లింగ్ కెమిస్ట్రీ ఈ పాటకు మరో అందాన్ని తీసుకొచ్చింది. ఇటీవలి కాలంలో వచ్చిన పెద్ద చార్ట్‌బస్టర్లలో ఇది కూడా ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎల్.వి. రేవంత్ అద్భుతంగా ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ మరింత ఫ్లేవర్ జోడించాయి. ట్యూన్ ఎంతో క్యాచీగా ఉండటంతో పాటు లీడ్ పెయిర్‌ను చాలా చార్మింగ్‌గా ప్రెజెంట్ చేసింది.

ఈ చిత్రానికి జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్  నిర్వహిస్తున్నారు. టెక్నికల్ స్టాండర్డ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అంతర్జాతీయ స్థాయిలో ఉండటంతో ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలుస్తోంది.

లెజెండరీ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ తన ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’ ఒక గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని విశేషాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

నటీనటులు: జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు, బ్రహ్మాజీ తదితరులు
About Writer
దేవీ
తర్వాతి కథనం
Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్