Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది
పవర్ స్టార్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ గబ్బర్ సింగ్ చిత్రానికి సంగీత దర్శకులు థమన్, దేవీశ్రీ ప్రసాద్ సంయుక్తంగా పనిచేయడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ప్రకటించారు. ఇదిలా వుండగా, ఏదైనా సినిమా పెద్ద సినిమా విడుదల అంటే చిన్న సినిమాలు కూడా వాయిదా పడుతుండేవి. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా వాయిదా పడ్డారు. కారణం ఏదైనా యశ్ సినిమా టాక్సిక్.. సినిమా జూన్ కు వెళ్ళిపోయింది.
ముందుగానే రామ్ చరణ్ పెద్ది చిత్రాన్ని మార్చి 26న రిలీజ్ చేస్తామని చెప్పగా, నాని ది ప్యారడైజ్ మార్చి 27న రిలీజ్ పక్కాగా రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఈ రెండు చిత్రాలు కూడా తమ రిలీజ్‌ను వాయిదా వేశారు. పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30కి, ది ప్యారడైజ్ చిత్రాన్ని ఆగస్టుకి వాయిదా వేశారు.
మొత్తంగా చూస్తే, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కడే సోలో హీరోగా మార్చి 26న మారిపోయాడు. దానితో తెలుగు ప్రేక్షకులకు ఇదే గొప్ప సినిమాగా మారబోతోంది. ఏది ఏమైనా షూటింగ్ ముందుగానే కొందరు విడుదల తేదీని ప్రకటిస్తారు. కానీ సినిమా పూర్తయ్యాక మరికొందరు ప్రకటిస్తారు. ఎన్ని చేసినా ప్రమోషన్లు, లెక్కలు అనుకూలించకపోతే ఇలా వాయిదా పడుతూ వుంటాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ కు మార్చి నెల కలిసి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.