1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The movie 'Missing Meghna' deserves to earn a good reputation: V.V. Vinayak.

మిస్సింగ్ మేఘన మూవీ కి మంచి పేరు రావాలి : వి. వి. వినాయక్

V. V. Vinayak, Bekkam Venugopal and move team
V. V. Vinayak, Bekkam Venugopal and move team
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిస్సింగ్ మేఘన. వాచస్పతి దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారి చేతుల మీదుగా జరిగింది. శామ్. కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో మూవీ టీం తో పాటు బెక్కం వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా వినాయక్ గారు మాట్లాడుతూ : బెక్కం వేణుగోపాల్, శ్రీనివాస్ సపోర్ట్ తో వాచస్పతి దర్శకుడిగా వస్తున్న సినిమా మిస్సింగ్ మేఘన. ఈ సినిమా తో హీరో రామ్ కార్తీక్ కి దర్శకుడు వాచస్పతికి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా ధృవన్ మ్యూజికల్ ఆల్ రౌండర్ పాటల రాస్తాడు మ్యూజిక్ చేస్తాడు అతడికి సినిమాతో మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో ఈ టీం కి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ : వి. వి. వినాయక్ గారిది గోల్డెన్ హ్యాండ్ ఆయన మా సినిమా టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీడియాతో నాకు మంచి అనుబంధం ఉంది ఈ సినిమాకి మీడియా బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ సినిమా ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రేక్షకులు మిచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
 
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ,  ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు వాచస్పతి గారికి ప్రొడ్యూసర్ నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.
 
సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధృవన్ మాట్లాడుతూ : లెజెండ్రీ డైరెక్టర్ వి. వి. వినాయక గారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ లాంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కి మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మ్యూజిషియన్ కి మ్యూజిక్ చేయడానికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా నాకు చాలా మంచి అవకాశం. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మా టీం ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
 
ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు నటించారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Keerthy Suresh: నిద్రలేని రాత్రులు గడుపుతున్న కీర్తి సురేష్..?