శనివారం, 18 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 17 మార్చి 2026 (19:21 IST)

ఉగాది పురస్కారాల్లో మూడు అవార్డ్ లు గెల్చుకున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా

Dikshit Shetty; Pemmasani Chandrasekhar; Rahul Ravindran
Dikshit Shetty; Pemmasani Chandrasekhar; Rahul Ravindran
రశ్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా వరుసగా అవార్డ్స్ సొంతం చేసుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాకు ఉత్తమ నటిగా రశ్మిక గద్దర్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో ఈ సినిమాకు మూడు అవార్డ్స్ దక్కాయి. చెన్నైలో జరిగిన శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ 28వ ఉగాది పురస్కారాల్లో ఉత్తమ నటిగా రశ్మిక, ఉత్తమ విలన్ గా దీక్షిత్ శెట్టికి అవార్డ్స్ దక్కాయి.

ఉత్తమ రచన, దర్శకత్వం విభాగంలో బాపు రమణల పురస్కారం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గెల్చుకున్నారు. దీక్షిత్ శెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా అవార్డ్స్ స్వీకరించారు. 
 
"ది గర్ల్ ఫ్రెండ్" సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు.