NTR: మరోసారి బ్రేక్ పడిన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్
ఎన్టీఆర్ కథానాయకుడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ చిత్రం డ్రాగన్. గత ఏడాది రామోజీ ఫిలింసిటీలో కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులు వాయిదాపడింది. తాజాగా సంక్రాంతికి ముందు వరకు మరికొంత షూటింగ్ జరుపుకుంది. తాజా సమాచారం మేరకు మరోసారి షూటింగ్ కు బ్రేక్ పడిందని సినీవర్గాలు తెలియజేస్తున్నాయి.
సంక్రాంతి తర్వాత ఎన్టీఆర్ జలుబుతో బాధపడుతున్నట్లు తెలిసింది. అందుకు వాయిస్ కాస్త బొంగురుపోవడంతో షూటింగ్ ను తప్పనిసరిగా వాయిదా వేయాల్సి వచ్చిందట. ఇప్పటికే కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ సినిమా షూట్ కు మరోసారి బ్రేక్ పడినా ఎన్.టి.ఆర్. కోలుకున్నాక వెంటనే షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని సమాచారం.
కాగా, ఈ సినిమాలో మలయాళ స్టార్ టోవినో థామస్, బిజూ మీనన్, బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. ప్రశాంత్ నీల్ విడుదల తేదీ గురించి మొదట అనుకున్నట్లుగా ఈ ఏడాది లోపు ప్రకటించినా, షూటింగ్ ఆలస్యం కారణంగా వచ్చే ఏడాది కానున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.