1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The producer stated that this is the reason behind the delay of the NTR-Prashanth Neel film

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం ఆలస్యానికి కారణం అదే అన్న నిర్మాత

NTR - Prashanth neel cinema
NTR - Prashanth neel cinema
ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్ పలువిధాలుగా వాయిదా పడుతూ వస్తోంది. దీనికి కారణాలు ఏమిటనేది సోషల్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ చిత్రం గురించి నిర్మాత చెర్రి ఓ ఇంటర్వ్యూలో రిలీవ్ చేశారు. ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా  స్క్రిప్ట్‌లో మధ్యలోనే కొన్ని మార్పులు జరిగాయని, మైత్రి మూవీ మేకర్స్ సి.ఈ.ఓ అయిన చెర్రీ (చిరంజీవి) తెలియజేశారు. ఆయన నిర్మాణంలో రూపొందిన సినిమా జెట్లీ. రేపు విడుదలకాబోతోంది. వెన్నెల కిశోర్, సత్య ప్రధాన తారాణంగా నటించారు.

ఇక ఎన్.టి.ఆర్. సినిమా గురించి చెబుతూ, "ప్రస్తుతం షూటింగ్ మంచి వేగంతో జరుగుతోంది, మేము ప్రకటించిన తేదీ నాటికి సినిమాను కచ్చితంగా విడుదల చేస్తాం. ప్రశాంత్ నీల్ గారు చాలా వేగంగా పనిచేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎన్.టి.ఆర్  హిందీ సినిమా ('War 2') విషయంలో ఎదురైన ఫలితం తర్వాత, మేము కొంత సమయం తీసుకుని కథలో కొన్ని మార్పులు చేశాము. ఇప్పుడు అంతా సవ్యంగా కుదిరింది, నిర్మాణం పూర్తి వేగంతో కొనసాగుతోంది."
భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ మరియు మొదటి గ్లింప్స్ మే 20న విడుదల కానున్నాయి. 

ఈ భారీ చిత్రం జూన్ 11, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ ఈ సినిమాను సహ-నిర్మాణం చేస్తోంది.
About Writer
దేవీ
తర్వాతి కథనం
కొడుకు వల్ల బిక్షాటన చేస్తున్న పెద్దాయన కథ ఆదారంగా దూరదర్శిని చిత్రం