ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 16 మార్చి 2026 (15:54 IST)

Chadalavada: పొడ్రూసర్స్ గిల్డ్‌ విషపురుగు, ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలే ముఖ్యం : చదలవాడ శ్రీనివాసరావు

Chadalavada Srinivasa Rao
Chadalavada Srinivasa Rao
ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సారధ్యంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తో హైదరాబాద్ ప్రెస్‌ క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్య క్రమం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలోని చిన్న సినిమాల స్థితిగతుల అంశం పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, ప్రముఖ దర్శకులు అజయ్‌కుమార్‌ ఎంతో మంది సీనియర్‌ జర్నలిస్టుల సమక్షంలో అంగరంగ వైభవంగా  జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఫిలిం క్రిటిక్స్  అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన "శూన్యం నుండి శిఖరాగ్రం వరకు" పుస్తకం గద్దర్ అవార్డ్ సాధించిన సందర్భంగా వారికి శ్రీనివాసరావు గారి చేతుల మీదగా చిరు సత్కారాభినందన జరుగింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
 
చిన్న సినిమాకి ప్రభుత్వ పరంగా ఎలాంటి సపోర్ట్‌ ఉండాలంటారు?
చిన్న సినిమాలకు ముఖ్యంగా ప్రభుత్వ సపోర్ట్‌కన్నా కూడా మా  ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్‌ అనేది చాలా అవసరం. అంతేకాక మా ఫిలిం ఛాంబర్‌ సపోర్ట్‌ కూడా చాలా అవసరం . .చిన్న సినిమా అనేది ఎదుగుదలకి ఒక మొక్కలాంటిది. ఎంత పెద్ద హిట్‌ అవ్వాలన్నాకూడా చెట్టుకి విత్తనం ఎంత అవసరమో చిన్న సినిమా కూడా ఇండస్ట్రీకి అంతే అవసరం. గతంలో 20,30ఏళ్ళ క్రితం చంద్రబాబుగారి హయాంలో చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చేవారు. ఒక సినిమాతో సక్సెస్‌ వస్తుందని ఎప్పుడూ నిర్మాత నమ్మకూడదు. అనుభవంతో ఉంటే ఏ నిర్మాత అయినా కూడా మంచి సినిమా తీయగలరు. రెండు గవర్నమెంట్లు కలిసి ఒక కమిటీ వేసుకుని చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. 
 
ఎనిమిది వారాల తరువాతే ఓటీటీకి ఇవ్వాలని తెలిసింది? ఈ ప్రభావం చిన్న సినిమాల పైన ఎంత వరకు పడుతుందని మీరు అనుకుంటున్నారు?
 
చిన్న సినిమా అనేది తీయడం వరకు తీస్తున్నాం కానీ దాన్ని బ్రతికించడం కష్టం అయిపోయింది. ఓటీటీ కాదు థియేటర్లలో రిలీజ్‌ చేయడం చాలా కష్టమయిపోయింది. సినిమా ప్రాడక్ట్‌ వరకు మనం తయారు చేయగలం. కానీ అవి విడుదలవ్వాలంటే థియేటర్లు గతంలో లాగా ఉండడం లేదు. ఒకప్పుడు థియేటర్‌కు జనం ఎక్కువగా వచ్చేవారు. ఇప్పుడు చాలా సినిమాలు ఉండడం వల్ల ఆడియన్స్‌ తగ్గిపోయారు. చిన్న సినిమాకి పర్సంటేజి, రేట్లు అన్నీ చూసుకుంటే ముఖ్యంగా విపరీతమైన తినుబండారాల రేట్ల వలన థియేటర్‌కి ప్రేక్షకులు రాకపోవడం వల్ల ముఖ్యంగా చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఎంటైర్‌ విధానాన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా చిన్న నిర్మాతల పరిస్థితి ఇండస్ట్రీలో బాలేదు అది సత్యం.
 
గతంలో మీరు ఒక మాట అననారు నిర్మాతలకు అసలు వాల్యూ లేదు...డైరెక్టర్‌కానీ, హీరోలు కానీ ప్రొడ్యూసర్‌కి వాల్యూ ఇవ్వడం లేదు అన్నారు. ఎందుకని ప్రొడ్యూసర్‌ ఒక క్యాష్‌బ్యాంక్‌లాగా ఎందుకు అయిపోయారు?
 
- ఎందుకు అవుతారు నేను అయ్యానా. సరైన నిర్మాత ఎవరికైనా ఎందుకు లొంగుతారు.  ఎప్పుడూ ఎదుటివారిది తప్పు ఉండదు. మనదే తప్పు ఉంటుంది. నేను కూడా పెద్ద సినిమాలు తీయగలను కానీ ఎందుకు తీయను. గతంలో నేను నాగేశ్వరావుగారితో, ఎన్టీఆర్‌తో, శోభనబాబుగారితో, కృష్ణతో, కృష్ణంరాజుతో పెద్ద సినిమాలే తీశాను కదా ఇప్పుడు ఎందుకు తీయడం లేదు. ఆ హీరోలు ఆ రోజుల్లో కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ ఆ సిన్సియారిటీ ఆ హానెస్టీ ఈరోజు లేదు కాబట్టి నేను చిన్న సినిమాలు నాకు తగ్గవి తీస్తున్నాను. నిర్మాత విలువ తగ్గించడం లేదు నేను అని అన్నారు. 
 
ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌నుంచి కొంత మంది నిర్మాతలు గిల్డ్‌ అనేది పెట్టుకున్నారు. అలా  వేరుపడడానికి గల పరిస్థితుల గురించి వివరించండి?
 
రెండు కుటుంబాలుంటే అందులో ఒకటి పేద కుటుంబం, ఒకటి రిచ్‌ కుటుంబం అనుకుందాం. అందులో పేద కుటుంబం అందరూ కలిసి కట్టుగా పని చేస్తున్నారు. పెద్ద కుటుంబంలో తండ్రి సంపాదించాక అందులో ఇద్దరు మేం బాగా సంపాదించాం అని బయటకు వెళ్ళిపోతే ఎలాగో మా సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే తయారయింది. ఎవరైతే ఇండస్ట్రీ ద్వారా పెరుగుతున్నారో వాళ్ళు నలుగురు ఒకటయి  కేవలం బిజినెస్‌తో అంటే భగవంతుడు గాలి, నీరు ఇచ్చారు కాబట్టి మనమందరం పీల్చుకుంటున్నాము. లేదంటే వీళ్ళ చేతుల్లో ఉంటే దాన్ని కూడా కొని మేము నలుగురమే బ్రతకాలి అంటారు

ఈ గిల్డ్‌ అనేవారు. గిల్డ్‌ అనేది ఒక విషపురుగు, విషసస్కృతి. నేను గతంలో కూడా ప్రభుత్వానికి చెప్పాను. మళ్ళీ కూడా చెబుతున్నాను ఈ విష సంస్కృతిని పోషించే సినీ పెద్దలను ప్రభుత్వం ప్రోత్సహించవద్దు. అది సినిమా ఇండస్ట్రీకి దండనా మీకు ఓట్లు వేసి గెలిపించేది మా చిన్న నిర్మాతలు, కార్మికులే కానీ మీరు గెలిచిన అనంతరం పెద్ద నిర్మాతల వెనుక తిరగడం పెద్ద నిర్మాతలతో ఫొటోలు దిగడం ముఖ్యంగా గిల్డ్‌ వారితో కలిసి ఫొటోలు దిగడం అనేది ప్రభుత్వం చేసేది మంచి పద్ధతి కాదు. 
 
చిన్న సినిమాకు మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? ఎంత బడ్జెట్‌ వరకు ఉంటే అది చిన్న సినిమా అవుతుంది?
 
పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా కరెక్టుగా తీస్తే 30రోజులు సరిపోతుంది. ఎం.ఎస్‌. విశ్వనాధ్‌గారుకానీ, విశ్వనాధ్‌గారు కానీ, చక్రవర్తిగారు కానీ మిగతా మ్యూజిక్‌ డైరెక్టర్లు అందరూ కూడా పాటను హాఫ్‌డేలో కంప్లీట్‌ చేశారు. ఒక సినిమాకి ఆరు పాటలుంటే మూడు రోజుల్లో కంప్లీట్‌ అయిపోయాయి. ప్రతి ఒక్కరం ఒక దగ్గరే ఉండి క్వాలిటీగా చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ అధునాతన సంగీతం వచ్చేసి అసలు డైరెక్టర్‌కి కూడా తెలియదు ఆ పాట ఏది వస్తుందో ఏమిటో ప్రొడ్యూసర్‌కి తెలియదు ఎవరికీ తెలియదు. పాత పద్ధతిలో ఉన్నప్పుడే క్వాలిటీ సాంగ్స్‌ వచ్చేవి. ఎక్కడికి వెళ్ళినా పాత సినిమాల పాటలే వినపడతాయి. 
 
కొత్త సినిమాల పాటలు వినపడవు. వీటి వలన క్వాలిటీ తగ్గిపోయింది.  సరిగ్గా షూటింగ్‌ సమయాల్ని ప్లాన్‌ చేసుకుంటే బావుంటుంది కానీ లేదంటే కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ పెరిగిపోయి సినిమా ఇండస్ట్రీ మంచిది కాదనడం సరికాదు. క్వాలిటీ ప్రాడక్ట్‌ రావాలంటే డిసిప్లయిన్‌గా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. చిన్న సినిమాకి నాకు తెలిసి మూడు నుంచి ఐదు కోట్ల వరకు మంచి సినిమాను తీయవచ్చు. మీరు అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల టెన్‌ పర్సెంట్‌ స్క్రీన్‌మీద కనిపిస్తే మిగతా టెన్‌ పర్సెంట్‌ చెత్త బుట్టలో పడిపోతుంది. గతంలో అడవిరాముడు చిత్రం 26రోజుల్లో తీశారు. ఇటీవలె సంక్రాంతికి విడుదలైన చిత్రాలను తీసుకుంటే నాలుగు చిత్రాల్లో ఒకటి చాలా కాస్ట్‌లీ చిత్రం కానీ తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమానే హిట్‌ అయింది.  ఈ సందర్భంగా ప్రభుగారి సతీమతి అయిన స్వర్గీయ మాధవిగారి పేరు మీద ఉన్న ట్రస్ట్‌ ద్వారా క్రిటిక్స్‌ అసోసియేషన్‌కి ప్రభుగారు చదలవాడశ్రీనివాసరావుగారి చేతుల మీదుగా యాభైవేల చెక్కును అందజేశారు. 
 
చిన్న సినిమా ఈ రోజున ఈ పరిస్థితికి రావడానికి కారణం ఇండస్ట్రీనే అనుకుంటున్నారు ?
 
ఎవరు తీసినా ఉషాకిరణ్‌మూవీస్‌ వారు ఎలాంటి సినిమాలు తీశారు, ఎల్‌.వి. ప్రసాద్‌గారు ఎలాంటి సినిమాలు తీశారు, రామానాయుడుగారు ఎలాంటి సినిమాలు తీశారు. మంచి మంచి సంస్థలు మనుషులు ఉన్నా లేకున్నా వారసత్వాలు రన్‌ అవుతున్నారు కానీ వారసత్వపు ప్రొడ్యూసర్స్‌ రన్‌ అవ్వడం లేదు. కారణం ఏమిటంటే... అసలు సినిమా ఇండస్ట్రీలో ఖర్చు పెట్టిన డబ్బు వెనక్కి రాదు. గతంలో 90పర్సెంట్‌ వచ్చేది. ఇప్పుడు తగ్గిపోయింది. కారణం ఏమిటంటే డిసిప్లయిన్‌ లేకపోవడం.ప్రొడక్షన్‌ వాల్యూస్‌ మన చేతిలో లేకపోవడం. 
 
గతంలో 2020,23లో ఎన్నో సినిమాలను రిలీజ్‌ కూడా చేశారు మీరు. చిన్న సినిమాలకు థయేటర్లే దొరకడం లేదన్నది పెద్ద సమస్యగా మారింది. అలాంటి పరిస్థితుల్లో నిర్మాత ఏం చేయాలి?
 
నేను గతంలో మినీ థియేటర్లను కడదాం అని ప్లాన్‌ చేశాను. ఛాంబర్‌ ద్వారా మినీ థియేటర్స్‌ పాంప్లేట్‌ చేస్తే 100 తీసేకువెళ్ళారు. కానీ మాకు ప్రభుత్వం తరపునుంచి ఎటువంటి సహాయం లేదు. చిన్న థియేటర్ల లైసెన్స్‌ 50 నుంచి 200 వరకు ప్రతీ కమ్యూనిటీలో, ప్రతీ సందులో, ప్రతీ సంస్థలో చిన్న సినిమాల వల్ల వ్యరేటీ కథలు బయటకు వస్తాయి. బడ్జెట్‌లో తీస్తారు. కాబట్టి మినీ థియేటర్స్‌ వస్తే బావుంటుంది అని నా అభిప్రాయం అన్నారు.