ప్రభాస్ 'ది రాజాసాబ్' మూవీ తొలి రోజు కలెక్షన్ అంతేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ది రాజాసాబ్. ఈ నెల 9వ తేదీ శుక్రవారం విడుదలైంది. మారుతి దర్శకుడు. మాళివికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. బాలీవుడ్ నటీనటులు సంజయ్ దత్, జెరీనా బేగంలు ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం. శుక్రవారం ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. ఇందులో ప్రభాస్ తొలిసారి భిన్నమైన లుక్‌లో కనిపించారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం బృందం శనివారం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఇందులో దర్శకుడు మారుతితో పాటు హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటిరోజు కలెక్షన్లు రూ.112 కోట్లు వచ్చినట్లు నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు.
'మొదటి రోజు కలెక్షన్లు వంద కోట్లు దాటుతాయని ముందే అనుకున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లు వచ్చాయి. చాలామంది దీన్ని కుటుంబసమేతంగా చూస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని మిశ్రమ కామెంట్స్ వచ్చినప్పటికీ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టింది' అని నిర్మాత అన్నారు.