సోమవారం, 16 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 జనవరి 2026 (19:33 IST)

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

raja saab
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు', యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' చిత్రాలకు టిక్కెట్ల ధరల పెంపు అంశంపై తెలంగాణ హైకోర్టు నుంచి ఊరట లభించింది. దీంతో ప్రభాస్ చిత్రానికి టిక్కెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం విడుదలకు ఒక రోజు మందు అంటే జనవరి 8వ తేదీన రాత్రి ప్రీమియర్ షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల లోపు ఈ ప్రదర్శన వేసుకోవచ్చని తెలిపింది. 
 
ఈ ప్రీమియర్ స్పెషల్ షో కోసం... ప్రీమియర్‌ టికెట్‌ ధరను రూ.1000 (పన్నులతో కలిపి) నిర్ణయించారు. ఇక జనవరి 9వ తేదీ నుంచి 10 రోజుల పాటు సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్‌ ధరపై రూ.150 (పన్నులతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.200 (పన్నులతో కలిపి) పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే, రోజుకు ఐదు షోలను ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ నేపథ్యంగా భారీ బడ్జెట్‌తో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. ప్రభాస్‌ సరసన మాళవిక మోహనన్‌, రిద్ధికుమార్‌, నిధి అగర్వాల్‌ నటించారు. సంజయ్‌దత్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. తమన్‌ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే యువతను ఆకట్టుకుంటున్నాయి.