Ramcharan: పెద్ది నుంచి రెండో సాంగ్.. రయ్ రయ్ రారా. రాబోతోంది
Peddi - Ray Ray song promo
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రం నుంచి మొదటి సాంగ్ చికిరి..చికిరి.. పెద్ద హిట్ అయింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ మాస్ స్పోర్ట్స్ డ్రామా పట్ల మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రెండో సాంగ్ గా ఓ మాస్ బీట్ తో కూడిందే. రయ్ రయ్ రారా.. అంటూ సాగే ఈ సాంగ్ ని ఈ మార్చ్ 2 నుంచి వస్తుందని వెల్లడించారు. ఇక దీనిపై వదిలిన పోస్టర్ కూడా ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఏ ఆర్ రెహమాన్ ఈ సాంగ్ కు మంచి బీట్ ఇచ్చాడని తెలుస్తోంది. క్రికెట్ నేపథ్యంగా సాగే ఈ సినిమాలో చరణ్ రూరల్ గెటప్ లో కనిపించనున్నారు.
రంగస్థలం తరహాలో సరికొత్తగా వుండబోతోందని దర్శకుడు ఇటీవలే తెలిపారు. ఇక ఈ సినిమాను వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుంది. సినిమా ఈ ఏప్రిల్ 30న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. నాయికగా జాన్వీ కపూర్ నటిస్తోంది.