మంగళవారం, 21 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 17 మార్చి 2026 (19:09 IST)

హ్యాపీ రాజ్ నుంచి జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ పై అద్దిరా లెక్క సాంగ్ రిలీజ్

G.V. Prakash Kumar, Sri Gowri Priya
G.V. Prakash Kumar, Sri Gowri Priya
స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'హ్యాపీ రాజ్'.  హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ ద్వారా మార్చి 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తోంది, ఇటివల విడుదలైన పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ “అద్దిరా లెక్క” సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ అదిరిపోయే బీట్స్‌తో ఈ సాంగ్‌ని కంపోజ్ చేశారు. గాయకుడు గోవింద్ ప్రసాద్ ఎనర్జీతో పాడిన ఈ పాటకు రెహ్మాన్ రాసిన లిరిక్స్ మంచి వైబ్ తీసుకొచ్చాయి.
 
ఈ సాంగ్‌లో జివి ప్రకాష్ కుమార్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టెప్స్ అన్నీ కలిసి సాంగ్‌ను మరింత ఎంటర్టైనింగ్‌గా మార్చాయి.
 
రిలీజ్ అయిన వెంటనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటూ, ఇన్స్టంట్ హిట్‌గా మారింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ మధన్ క్రిస్టోఫర్, మ్యూజిక్ జస్టిన్ ప్రభాకరన్, ఎడిటర్ ఆర్కె సెల్వ, ప్రొడక్షన్ డిజైనర్ కుమార్ గంగప్పన్.  
 
హ్యాపీ రాజ్ మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సపోర్ట్ తో ఈ చిత్రం తెలుగులో స్ట్రాంగ్ రన్ అందుకోనుంది.
 
తారాగణం: జివి ప్రకాష్, శ్రీ గౌరీ ప్రియ, అబ్బాస్, జార్జ్ మరియన్, గీతా కైలాసం, ప్రార్థన నాథన్, అదుర్చి అరుణ్, మధురై ముత్తు, దేవి మహేష్, సోఫాబాయ్ రసూల్