1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The 'Tabahi song features the chemistry between Yash and Kiara Advani as its main attraction

Toxic song: యశ్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా తబాహీ సాంగ్

Yash, Kiara Advani at beach song
Yash, Kiara Advani at beach song
మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ కంపెనీ కలిసి 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' సినిమాలోని తొలి పాట 'తబాహీ' అఫీషియల్ మ్యూజిక్ వీడియోను విడుదల చేశాయి. ఆడియో విడుదలైనప్పటి నుంచే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాటకు ఇప్పుడు విజువల్ రూపం రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
 
 
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'తబాహీ' మ్యూజిక్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఆడియోతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ పాట, ఇప్పుడు అద్భుతమైన విజువల్స్‌తో మరింత ప్రత్యేకంగా నిలిచింది. భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాక్సిక్' ప్రపంచాన్ని తొలిసారి ఈ మ్యూజిక్ వీడియో పరిచయం చేస్తోంది.
 
రాకింగ్ స్టార్ యశ్, కియారా అద్వానీ తొలిసారి జంటగా కనిపిస్తున్న ఈ పాటలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేమను అత్యంత స్వచ్ఛంగా, గాఢంగా చూపించిన ఈ పాట, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో కూడిన కథనం, పవర్‌ఫుల్ గిటార్ అరేంజ్‌మెంట్స్, గ్రాండ్ ఆర్కెస్ట్రాతో ఆకట్టుకుంటోంది. ఈ మ్యూజిక్ వీడియో 'టాక్సిక్' సినిమాలోని ప్రత్యేకమైన ప్రపంచానికి చక్కని పరిచయంగా నిలుస్తోంది.
 
మ్యూజిక్ వీడియో విడుదలకు ముందు మేకర్స్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రమోషన్ చేశారు. జూలై 7న 'టాక్సిక్' అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి "దొంగచాటుగా మాత్రమే బతికే ప్రేమను ఏమంటారు?" అంటూ ప్రశ్నిస్తూ కియారా అద్వానీని ట్యాగ్ చేశారు. దీనికి కియారా ఒక్క మాటతో "తబాహీ" అని సమాధానం ఇచ్చారు. వెంటనే జీ మ్యూజిక్ కంపెనీ "స్టే ట్యూన్డ్..." అంటూ స్పందించడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
 
విశాల్ మిశ్రా స్వరపరచి, ఆలపించిన ఈ పాటకు హిందీలో రాజ్ శేఖర్ సాహిత్యం అందించారు. ఈ పాటను హిందీతో పాటు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు. ఆయా భాషలకు యోగరాజ్ భట్ (కన్నడ), రామజోగయ్య శాస్త్రి (తెలుగు), విగ్నేష్ శివన్ (తమిళం), రఫీక్ అహ్మద్ (మలయాళం) సాహిత్యం అందించడం విశేషం. ఈ మల్టీలాంగ్వేజ్ విడుదలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవాలనే సినిమా లక్ష్యం మరోసారి స్పష్టమైంది.
 
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ మిశ్రా మాట్లాడుతూ, "'తబాహీ' సాధారణ ప్రేమగీతం కాదు. ప్రేమలోని త్యాగం, ఆవేశం, భావోద్వేగాలను ఈ పాట చూపిస్తుంది. 'టాక్సిక్' కోసం అలాంటి ఇంటెన్స్  మోసుకెళ్లే సంగీతం కావాలి. యశ్ తెరపై చూపించే ఎనర్జీకి తగ్గట్టుగా సంగీతాన్ని అందించడానికి ప్రయత్నించాను. ప్రేమ మనల్ని ఓదార్చే ముందు పూర్తిగా ముంచెత్తే భావనను ఈ పాటలో చూపించాలనుకున్నాను"
 
యశ్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథ అందించిన ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించగా, తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు.
 
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యశ్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రం ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Eluru Srinu : బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా డ్యూ డేట్‌ చిత్రం ప్రారంభం