1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The teaser for the film Aakasamlo O Tara is being prepared.

Dulquer Salmaan: ఆకాశంలో ఓ తార చిత్రం టీజర్ సిద్ధమవుతోంది

satTvika Veeravalli
satTvika Veeravalli
ప్రపంచం తన కోసం ఊహించిన దానికంటే మించి కలలు కనే ధైర్యం ఉన్న ప్రతి అమ్మాయి కోసం... ఇది మీ కోసం.. అంటూ నిర్మాత స్వప్నా దత్ తను నిర్మిస్తున్న చిత్రం ఆకాశంలో ఓ తార చిత్రం గురించి కాప్షన్ పెట్టింది. అందులో భాగంగా రేపు టీజర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. టీజర్ పోస్టర్ లో కథానాయిక సాత్విక వీరవల్లి ని పరిచయం చేసింది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది.
 
 
ఇప్పటికే ఈ చిత్రం కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. మధ్యలో దుల్కర్ మలయాళ సినిమాలు చేయడంతో గేప్ వచ్చినట్లు తెలుస్తోంది. కథప్రకారం తీసుకుంటే, కనీస వసతులు కూడా లేని ఓ పల్లెటూరి అమ్మాయి తన కలలను సాధించుకునేందుకు ఏం చేసింది? డ్రీమ్స్ ఎలా నెరవేర్చుకుంది? అనేదే బ్యాక్ డ్రాప్‌గా మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఫస్ట్ గ్లింప్స్‌లోనూ సున్నితమైన భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా ఆకట్టుకుంటోంది. దుల్కర్ ఫస్ట్ లుక్ సాఫ్ట్ గా వుంది.
 
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సాగుతున్నాయి. నవంబర్ 20వ తేదీన సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు.  గీతాఆర్ట్స్, స్వప్న సినిమా బేనర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జీవి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రుతిహాసన్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Kalki 2: ప్రభాస్ పుట్టినరోజు తర్వాత కల్కి సీక్వెల్ ముంబైలో జరగనుంది ?