సంబంధిత వార్తలు
- Ravibabu: రవిబాబు, సురేష్ ప్రొడక్షన్స్ కాంబినేషన్ లో రేజర్ సిద్ధమవుతోంది
- Ravibabu: రేజర్ చిత్రంతో రవిబాబు సక్సెస్ సాధిస్తాడా
- మమ్ముట్టి నటించిన మలయాళీ చథా పచ్చ తెలుగులో రాబోతోంది
- రవిబాబు, సురేష్ ప్రొడక్షన్స్ మూవీ టైటిల్ రేజర్- ఇంటెన్స్ పవర్ఫుల్ గ్లింప్స్ రిలీజ్
- Tharun Bhascker: జింగాలా సాంగ్ కు డాన్స్ వేసిన గాయపడ్డ సింహం
Ravibabu: చైల్డ్ ను కాపాడేందుకు రవిబాబు ఏం చేశాడనే పాయింట్ తో రేజర్ ట్రైలర్ రిలీజ్
Ravi Babu - Razor movie
అవసరంలో ఉన్నవారికి దేవుడు రక్షకుడిగా దేవదూతను పంపుతాడని అంటారు. కానీ మరణం వెంబడిస్తూనే ఉండి, తప్పించుకోవడం అసాధ్యమయ్యే సమయంలో అదే దేవదూత విధ్వంసానికి ప్రతీకగా మారుతుంది. కరుణ మాయమైతే మిగిలేది కేవలం ఆగ్రహం మాత్రమే. తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు కోపం, క్రోధం, కలహం, విధ్వంసం అన్నీ కలిసి రేజర్గా మారుతుంది
ట్రైలర్ ఒక డార్క్, ఫెరోషియస్ ప్రపంచాన్ని సూచిస్తోంది. ఈ కథలో రవి బాబు ఒక డాగ్ గ్రూమర్‌గా కనిపిస్తారు. ఒక చిన్న అమ్మాయిని కాపాడేందుకు అతను ఎంతవరకు వెళ్తాడో చూపించే పాత్ర ఇది. ఎమోషన్ ఇంటెన్సిటీ రెండింటినీ బ్యాలెన్స్ గా చూపించే పాత్రగా ఆసక్తిని పెంచింది.
రచయిత, దర్శకుడిగా రవి బాబు తన ప్రత్యేక స్టయిల్ ని కొనసాగిస్తూ, ఈసారి మరింత అందరికీ చేరువయ్యే కథనంతో ముందుకొచ్చారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రం బలంగా ఉంది. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ, ఎస్‌ఎస్ రాజేష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సతీష్ పొలుజు యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ కలిసి సినిమాకు మరింత బలం చేకూర్చాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ట్రైలర్ ఆసక్తిని పెంచుతూ రేజర్ను ఒక హై-వోల్టేజ్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుందని ప్రామిస్ చేస్తోంది. మే 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
