1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. The TV movie Thimmarajupalli is coming to OTT for streaming.

Kiran Abbavaram: ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న తిమ్మరాజుపల్లి టీవీ సినిమా

Thimmarajupalli TV is now streaming on OTT
Thimmarajupalli TV is now streaming on OTT
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్నిసొంతం చేసుకుంది.

తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమయ్యింది. "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆహా గోల్డ్ యూజర్స్ 24 గంటల ముందుగానే ఈ చిత్రాన్ని చూడొచ్చు. థియేట్రికల్ గా ప్రేక్షకుల్ని అలరించిన "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా ఇప్పుడు ఆహా ద్వారా మరింతమంది ఆడియెన్స్ కు చేరువకానుంది.
నటీనటులు - సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు
About Writer
దేవీ
తర్వాతి కథనం
మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ నిర్మించిన రావు బహదూర్ చిత్రం డేట్ ప్రకటన