అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ
Jaya Shiva Surya, Isha Manohari Priya
జయ శివ సూర్య , నిఖిత శ్రీ, ఇషామనోహరి ప్రియ జంటగా నటిస్తున్న తాజా చిత్రం '100 డేస్ లవ్ స్టోరీ'. విజయమిత్ర దర్శకత్వం వహిస్తున్నారు. పురిపండా వెంకటరమణ మూర్తి శర్మ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి 'అతి ప్రేమ భయానకం' (Too much love is scary) అనే వైవిధ్యమైన ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు.
ప్రేమలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... "ప్రేమ కథా చిత్రాల్లో ఇది ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుంది. దర్శకుడు విజయమిత్ర కథను డీల్ చేసిన విధానం, హీరో హీరోయిన్ల నటన ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 27న థియేటర్లలో మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము" అని తెలిపారు.
నటీనటులు: జయ శివ సూర్య , ఇషా మనోహరి ప్రియ, జబర్దస్త్ అప్పారావు,ఆకెళ్ళ గోపాల కృష్ణ,కుమరున్ సేతురామన్ తదితరులు. దర్శకత్వం: విజయమిత్ర, నిర్మాత: పురిపండావెంకటరమణ మూర్తి శర్మ