సంబంధిత వార్తలు
- V.V. Vinayak: వడ్డే నవీన్ సినిమాలు ఇష్టంతో చేయలేదు : వి. వి. వినాయక్
- Vadenaveen: వడ్డే నవీన్ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల
- Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు
- Manchu Laxmi: అందరూ కలిస్తే పిల్లల భవిష్యత్తును మార్చే ఉద్యమం అవుతుంది : లక్ష్మీ మంచు
- Eesha Rebba: సూపర్ హిట్ వెబ్ సిరీస్ 4 మోర్ షాట్స్ ప్లీజ్ అంటున్న సీజన్ 2
Vadde Naveen: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది : వడ్డే నవీన్
Vadde Naveen
*ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు కథను ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి?*
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాలోని పాయింట్, కథ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. ఈ కథ నాకు చాలా నచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుంది.
*ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మీ కంఫర్ట్ జోన్‌కి దూరంగా ఉంది కదా?*
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది. కేవలం కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాల్ని ఇస్తే సరిపోవడం లేదు. అన్ని అంశాల్ని జోడించి సరికొత్త పాయింట్, కంటెంట్‌ను అందిస్తేనే ఆదరిస్తున్నారు. ఈ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు చిత్రంలో కొత్త కంటెంట్ ఉంటూనే.. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా తెరకెక్కించాం.
*రీ ఎంట్రీలో మీరే నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది?*
నాకు ఈ కథ మీదున్న నమ్మకం వేరే నిర్మాతలకు ఉండాలని లేదు. వేరే నిర్మాత అయితే కథ మారుస్తారని కాదు.. ఈ కథని నేను నమ్మాను. నిర్మించేందుకు కూడా ముందుకు వచ్చాను.
*ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు చిత్రంలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందా?*
త్రిమూర్తులు పాత్రలోనే ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానిస్టేబుల్ పాత్రకి తగ్గట్టుగానే ఇందులో కనిపిస్తాను. ఈ సినిమా అయితే ప్రేక్షకులు ఊహించినట్టుగా రెగ్యులర్‌గా ఉండదు. సిస్టంలో ఉంటూనే పోరాడే కానిస్టేబుల్ పాత్రలో నేను కనిపిస్తాను. స్క్రిప్ట్ మీద ఏడాది పాటుగా పని చేశాం.
*ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఎంత రియలిస్టిక్ ఉంటుంది?*
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు చాలా వరకు రియలిస్టిక్‌గానే ఉంటుంది. పూర్తిగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా ఉండదు. అవసరం ఉన్న చోట మాత్రమే ఫైట్, పాటలను పెట్టాం.
*నిర్మాణంలో అప్పటికి, ఇప్పటికి వచ్చిన మార్పులను గమనించారా?*
ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది. నిర్మాణంలోనూ చాలా మార్పులు వచ్చాయి. అయితే అన్నీ పక్కాగా ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మాకు ఎక్కడా ఎలాంటి సమస్య రాలేదు. అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే అయింది. ఇప్పటికే జీ టీం ఓటీటీ హక్కుల్ని తీసుకుంది.
*ప్రస్తుతం ఆడియెన్స్ మీ మీద కురిపిస్తున్న ప్రేమను చూస్తున్నారా?*
గత పన్నెండేళ్లలో మన తెలుగు ఆడియెన్స్ నేను ఎక్కడ కనిపించినా కూడా మళ్లీ సినిమాలు చేయండి సార్ అని ప్రేమగా అడిగేవారు. ఇప్పుడు మా సినిమా మీద, నా మీద కురిపిస్తున్న ప్రేమను చూస్తున్నాను. వారి అభిమానానికి ఎప్పుడూ రుణపడే ఉంటాను.
*ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన పాత్రలు, సినిమాలు ఏంటి?*
నాకు రంగస్థలం మూవీ నచ్చింది. అందులో రామ్ చరణ్, జగపతి బాబు పాత్రలు నచ్చాయి. పుష్పలో అల్లు అర్జున్ పాత్ర నచ్చింది. రీసెంట్‌గా అంటే చిరంజీవి గారు చేసిన మన శంకర వర ప్రసాద్ గారు నచ్చింది.
*పెద్ద దర్శకులతో సినిమా చేసే అవకాశం ఉన్నా కూడా కొత్త డైరెక్టర్‌తో ఎందుకు చేశారు?*
నేరుగానే పెద్ద దర్శకుడితో సినిమా చేయొచ్చు. కానీ ముందు నా మార్కెట్ ఎంత ఉందో తెలియాలి. పైగా అవతల ఉన్న పెద్ద దర్శకులకు నాతో చేయాలని కూడా ఉండాలి. ముందు నా సినిమా బయటకు వస్తే.. నా మార్కెట్ తెలుస్తుంది.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు రిలీజ్ తర్వాత ఎలాంటి ప్రశంసలు వస్తాయని అనుకుంటున్నారు?
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు చూశాక మంచి సినిమా చేశాడు అనే ఫీడ్ బ్యాక్ ఇస్తారని మాత్రం ఆడియెన్స్ నుంచి వస్తుందని నమ్ముతున్నాను. ఇప్పటి వరకు నా ఫ్యామిలీ మెంబర్లలో ఓ వంద మంది చూశారు. అందరూ చిత్రాన్ని చూసి సర్ ప్రైజ్ అయ్యారు. నన్ను నేను ప్రమోట్ చేసుకునేలా సినిమా తీసి ఉంటానని వాళ్లంతా అనుకుని ఉంటారు. కానీ కథ, కంటెంట్ ఇవన్నీ చూసి అందరూ షాక్ అయ్యారు.
*నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్టులు చేయాలని అనుకుంటున్నారు?*
ప్రస్తుతం సోలో హీరోగా చేస్తున్నాను. అలానే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను. కథ నచ్చితే మల్టీస్టారర్ అయినా సరే చేస్తాను. కంటెంట్ నచ్చితే ఓటీటీ కోసం కూడా ప్రాజెక్ట్ చేస్తాను.
*ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఎలా ఉండబోతోంది?*
కథ నెమ్మదిగానే ప్రారంభం అవుతుంది. కానీ సంఘర్షణ మొదలయ్యాక.. క్లైమాక్స్ వరకు గ్రిప్పింగ్‌గా వెళ్తుంది. క్లైమాక్స్‌ని మాత్రం ఎవ్వరూ ఊహించలేరు.
