అప్పుడు బాత్రూంలో కూర్చొని ఏడ్చా, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఏడ్చారు: దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్
ఐటి జాబ్ చేస్తూ 2016లో గీతా సుబ్రహ్మణ్యం సిరీస్ చేశాను. అది మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత పెళ్లిగోల సిరీస్ రెండు సీజన్స్ చేశాను. ఆ తర్వాత ఆహాలో గీత సుబ్రహ్మణ్యం సిరీస్ రెండు సీజన్స్ చేశాను. ఆ తర్వాత నిహారిక గారు పిలిచి హలో వరల్డ్ ఇచ్చారు. ఇవన్నీ ఐటి జాబ్ చేస్తూనే చేశాను. 2020 లో జాబ్ మానేసి ఫుల్ గా ఫోకస్ పెడదాం అనుకున్నాను. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. అప్పుడు మా ఆవిడ జాబ్ చేస్తూ సపోర్ట్ చేసింది అని బ్యూటీ చిత్ర దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్ తెలిపారు.
అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం బ్యూటీ. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. నేడు సినిమా దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్ పలు విషయాలు తెలిపారు.
- బ్యూటీ కథ మారుతీ గారు పిలిచి నాకు ఇచ్చారు. దీన్ని సుబ్రహ్మణ్యం అనే జర్నలిస్ట్ రాసారు. ఆయనే డైరెక్ట్ చేయాలి కానీ వేరే వాళ్లకు ఇమ్మనడంతో జీ వాళ్ళు నన్ను ప్రపోజ్ చేశారు నా వర్క్ నచ్చి. మొదటిసారి నేను వేరే వాళ్ళ కథకు పనిచేసాను. దాంతో నేను వారం రోజులు కథని అర్ధం చేసుకున్నాను.
- హీరో - హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది గీతా సుబ్రహ్మణ్యం లాగే. సినిమాలో ఒక మంచి డ్రామా నడుస్తుంది. బోర్ కొట్టదు. నిన్న ఈవెంట్లో మాట్లాడిన వాళ్లంతా సినిమా చూసి అంతా బాగా మాట్లాడారు. ఇందులో అన్ని పాత్రలకు రిలేట్ అవుతాము. హీరోయిన్ ని చూస్తే పక్కింటి అమ్మాయి అనిపిస్తుంది. మొదట వేరే అమ్మాయి అనుకున్నాం కానీ ఆమె హీరోయిన్ లాగా కనిపిస్తుంది పక్కింటి అమ్మాయిలా లేదని మార్చేసాము.
-అంకిత్ రియాల్టీగా నటించాడు. ఒక షాట్ లో కింద పడితే నిజంగానే పడాలి, ఎలాంటి సేఫ్టీ లేకుండానే నిజంగానే పడ్డాడు. అంకిత్ సినిమాని తన భుజాల మీద మోస్తున్నాడు.
- మధ్య తరగతి అమ్మాయి గురించి చెప్పాలి. ఇప్పుడు అందరూ మన జీవితం కాకుండా పక్కనోళ్ళ జీవితం చూసి కంపారిజన్ చేసుకుంటున్నారు. ఇందులో హీరోయిన్ కూడా టీనేజర్స్ లాగా పక్కనోళ్ళతో కంపేర్ చేసుకొని తన కుటుంబ స్థితి మర్చిపోయి అది కావాలి ఇది కావాలి అంటారు. మనం స్థితికి మించి వాళ్ళని చదివిస్తాం అయినా వాళ్ళు పక్కనోళ్ళతో కంపేర్ చేసుకుంటారు. మనం ఎంత చేసినా చిన్న లోటు కనిపిస్తే దాన్ని హైలెట్ చేస్తారు పిల్లలు. అదే కథాంశంతో ఉంటుంది. ఇప్పుడు అందరూ నేను ఎంజాయ్ చేయలేదు, నా పిల్లలు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇది ఇంకా తప్పు. ఈ సినిమాలో నాన్న క్యాబ్ డ్రైవర్ అయినా ఆయన స్థితి మించి చేస్తున్నా కూతురికి తెలీదు. ఇందులో క్లాస్ లు పీకడాలు ఏమి లేవు. ఒక జీవితం చూపిస్తాను. ఈ కథలో జీవితం చూపిస్తున్నాం అందుకే నేను కనెక్ట్ అయ్యాను.
- నేను కొంచెం ఎమోషనల్. నాకు భలే ఉన్నాడే సినిమా ప్రివ్యూ దగ్గరే అర్థమైంది సెకండ్ హాఫ్ వర్కౌట్ అవ్వలేదని. ముందే తెలిసింది భ అది ఫెయిల్ అయ్యాక ఒక గంట సేపు బాత్రూంలో కూర్చొని ఏడిచాను. తర్వాత అక్కడితో వదిలేసి మూవ్ అయ్యాను. ఆ సినిమాకు కొన్ని వర్కౌట్ అవ్వలేదు.
- మారుతీ గారు సినిమా చూసి ఒక 5 నిముషాలు కట్ చేస్తే బాగుండు అని అన్నారు. ఆయన చెప్పాక నేను కూడా చూసి ఒక ఏడు నిమిషాల వరకు కట్ చేశాను. ఈ సినిమాలో హీరోయిన్ ఇన్నర్ బ్యూటీ కంటే ఔటర్ బ్యూటీ కి ఎక్కువ విలువ ఇస్తుంది. అది కాదు ఇన్నర్ బ్యూటీ ఇంపార్టెంట్ అని చెప్పడానికి. బ్లాక్, వైట్ అంటూ ఏమి ఉండదు ఇన్నర్ బ్యూటీ ఉండాలి.
- సినిమా చూసిన వాళ్ళు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మారుతీ గారికి బాగా నచ్చింది కాబట్టే ఆయన నిన్న ఈవెంట్లో అంత బాగా మాట్లాడారు. ఒక డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ హాఫ్ అయ్యాక బానే ఉంది అన్నారు. సెకండ్ హాఫ్ అయ్యాక ఏడుస్తూ బయటకి వచ్చారు. నేను సాధించాను అనిపించింది. కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ చూసారు. సినిమా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు చూసి చెప్పాలి. మన వాళ్ళు చూస్తే సినిమా బాగుంది అనే అంటారు. ముందే ప్రీమియర్స్ వేస్తాము.
- నెక్స్ట్ కథలు.. మట్టి వాసన కథలు చెప్పాలి. ఒక మార్షల్ ఆర్ట్స్ కథ రాసుకున్నా. దాని గురించి ట్రైనింగ్ నేర్చుకున్నా. మనలోంచి కథలు రావాలి. అలాంటి కథలే రాస్తాను. జనాల్ని గమనించి రాసుకుంటాను. నాకు యాక్షన్ కూడా ఇష్టమే. సిరీస్ లు కూడా చేస్తాను. బతకడానికి డబ్బులు కావాలి. డబ్బుల కోసం చేస్తాను. గీత సుబ్రహ్మణ్యం, పెళ్లిగోల సీక్వెల్స్ కి పిలిస్తే వెళ్తాను. అమెజాన్ తో ఒకటి డిస్కషన్స్ జరుగుతున్నాయి.