సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 2 మార్చి 2026 (17:03 IST)

దుబాయ్‌లో ప్రశాంతంగా వుంది: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ

Sreeja at Dubai
దుబాయ్ దేశంలో నివాసం వుంటున్న మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ తమ పరిస్థితి గురించి వివరించారు. తన ఇన్ స్టాగ్రాం పేజీలో ఆమె ఇలా రాసారు. మాకోసం కాల్ చేసిన మరియు సందేశాలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మేము ఇక్కడ దుబాయ్‌లో సురక్షితంగా వున్నాము. ప్రస్తుతం చాలా ప్రశాంతంగా వుంది.
 
ఆమె తన పోస్టుతో పాటు ఫోటోలో సూర్యోదయంలో బుర్జ్ ఖలీఫా, దుబాయ్ స్కైలైన్ జోడించారు. అక్కడ యుఎఇ జెండా ప్రముఖంగా ఎగురుతూ కనిపిస్తోంది. దానికింద ఆమె ఇలా రాసారు. మేము ఈ దేశాన్ని ఎంచుకున్నాము. ఈ దేశంతోనే నిలబడతాము అని పేర్కొన్నారు.