తెలిసినవారికి వివరణ అవసరం లేదు, చెప్పినా వినరు : ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినిమారంగంలో చర్చకు దారి తీశాయి. మతం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలకు పలువురు సున్నితంగా తిరస్కరించారు. తెలుగు సినీరంగంలో సంగీత ప్రపంచంలో వున్నవారు ఎవరినీ అడిగినా నో కామెంట్.. అంటూ తప్పుకుంటున్నారు. కాగా, తాజాగా ఏఆర్ రెహమాన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని అందుకు తగిన వివరణ ఇచ్చారు. మొదట నిరాకరించినప్పటికీ చెప్పక తప్పలేదు.
ఇంతకు ముందు బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ చేసిన వ్యాఖ్యలు.. ఈ మధ్య అవకాశాలు తగ్గాయి అనే కోణంలో ఆయన మాట్లాడుతూ, బాలీవుడ్‌లో ఓ వర్గం తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లో హిందీ పరిశ్రమ ఉందని చెప్పిన మాటలు విమర్శలకు తావిచ్చాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు సినీ ప్రముఖులు స్పందించారు.
ఇక, తాజాగా పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ అంశంపై ప్రస్తావన వచ్చింది. అందుకు ఆయన మాట్లాడుతూ, మనమేంటో తెలిసినవారికి ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా వాళ్లు వినరు.. అంటూ నరదాగా మాట్లాడారు. జీవితంలో కొన్ని విషయాల నుంచి త్వరగా బయటపడటం మంచిదని వ్యాఖ్యానించారు. సో. ఏఆర్ రెహమాన్ మాట్లాడడం..దీనిపై ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ, సూర్యుడిని కొద్ది సేపు కమ్మిన మబ్బులాంటిదని వ్యాఖ్యానించారు.