సంబంధిత వార్తలు
- Venkat: హరుడు కోసం ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది : వెంకట్
- మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం
- Hero Venkat: హీరో వెంకట్ మాస్ ఎంటర్ టైనర్ హరుడు
- మధ్యాహ్న భోజన పథకం: వారానికి ఒకసారి చికెన్ స్థానంలో చేపలు
- ఎమ్మెల్యేల ఫిరాయింపు.. స్పీకర్ నిర్ణయంపై సవాలు చేస్తూ పిటిషన్.. సుప్రీంకోర్టు విచారణ
బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి
టాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీహరి. ఆయన తన కెరీర్లో అగ్రస్థానంలో వుండగానే దురదృష్టవశాత్తూ అనారోగ్యంతో కన్నుమూశారు. తన భర్త శ్రీహరి గురించి ఆయన భార్య డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. తన బావ శ్రీహరి గారు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎంతోమంది పేదలకు సాయం చేసారని వెల్లడించారు.
ఎందరికో ఉద్యోగాలు ఇప్పించారనీ, డబ్బులు కోసం ఎవరైనా వస్తే తనవంతు సాయం చేసి గౌరవంగా పంపేవారని గుర్తుచేసుకున్నారు. ఐతే ఆయన నుంచి సాయం పొందినవారు ఇప్పుడు మంచి పొజిషన్లో వున్నారనీ, తన భర్త మరణించాక వారెవరూ ఇటువైపు తొంగికూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేసారు. మనుషులు అంటే ఇలాగే వుంటారా అని తనకు అనిపించిందనీ, ఐతే తన బావ శ్రీహరి గారు వున్నప్పుడు తమ పొజిషన్ ఎలా వుందో ఇప్పుడు కూడా అలాగే వుందని ఆమె చెప్పారు. డిస్కో శాంతి చెప్పిన ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తర్వాతి కథనం
