1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Tollywood Producer Bandla Ganesh eager to speak openly about pawan kalyan

పవన్ ఎలాంటివారో ప్రపంచానికి చెప్పేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా: బండ్ల గణేశ్

pawan kalyan
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను దేవుడుగా భావించే పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్, నైజాన్ని, నిజాయితీని ప్రపంచానికి తెలియజెప్పేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. పవన్ గురించి మనసు విప్పి మాట్లాడే అవకాశం కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు. ఆ రోజు వచ్చినపుడు పవన్ గొప్ప మనసు, వ్యక్తిత్వం గురించి తనకు తెలిసిన నిజాలను ప్రపంచం ముందు గర్వంగా చెబుతానని పేర్కొన్నారు. 
 
ఇదే అంశంపై బండ్ల గణేశ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సర్ గురించి నాకు తెలిసిన నిజాలను, ఆయన క్యారెక్టర్‌ను, ఆయన నైజాన్ని ప్రపంచానికి చెప్పే అవకాశం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. పదవులు, హోదాలు కాదు.. మనిషి విలువ అతని ప్రవర్తన, మాట, మనసులో ఉంటుందని నిరూపించిన వ్యక్తి ఆయన అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 
 
అలాంటి మహోన్నత వ్యక్తి గురించి తన హృదయంలో ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచే ఆ క్షణం కోసం వేచి చూస్తున్నట్టు బండ్ల గణేశ్ తన వ్యాఖ్యల్లో తెలిపారు. పవన్ పట్ల బండ్ల గణేశ్‌కు ఉన్న ప్రత్యేక అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సందర్భాల్లో ఆయన పవన్‌ను దేవుడిగా అభివర్ణించిన విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్