పీరియాడిక్ కథతో టొవినో థామస్ మూవీ పళ్లి చట్టంబి రూపొందుతోంది
Pallavi Chattambi, Tovino Thomas
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ పళ్లి చట్టంబి. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ రోజు "పళ్లి చట్టంబి" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ద్వారా సినిమా రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు. ఏప్రిల్ 9న ఈ ప్రెస్టీజియస్ మూవీని హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 50, 60 దశకాల నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ మూవీలో హీరో టొవినో థామస్ ఇప్పటిదాకా చూడని విధంగా సరికొత్తగా కనిపించనున్నారు. "పళ్లి చట్టంబి" మోషన్ పోస్టర్ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెంచుతోంది.
నటీనటులు - టొవినో థామస్, కయదు లోహర్, విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెక్జాండర్, తదితరులు