1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ustaad Bhagat Singh team shares happiness at films success press meet

అదరగొడుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ... ఉప్పొంగిపోతున్న ఫ్యాన్స్

Ustad Bhagat Singh's third single Caller Aye Etara
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలైన తొలి రోజు, తొలి ఆట నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్‌తో అదరగొడుతోంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందనతో చిత్రం బృందం కూడా ఉప్పొంగిపోతోంది.
 
ఈ సక్సెస్ ఆనందంలో చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు హీరో పవన్‌ను కలిసి తమ సంతోషాన్ని పంచుకుని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. సినిమాకు లభిస్తున్న స్పందన గురించి పవన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన చిత్ర బృందానికి పవన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. 
 
కాగా, ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించగా, దేవీశ్రీ ప్రసాద్, థమన్‌లు సంగీతం అందించారు. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో నిర్మాతలు హైదరాబాద్ నగరంలో సక్సెస్ వేడుకలను నిర్వహంచారు. 
తర్వాతి కథనం
పాపికొండలకు సందర్శకుల తాకిడి.. గోదావరి నదిలో మొసళ్లు.. చేపల వేట