ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 మార్చి 2026 (09:12 IST)

పూనకాలు తెప్పిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' - దమ్మున్నోడు దాటొచ్చంటున్న పవన్ (వీడియో)

pawan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రం కోసం కోట్లాది మంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా ట్రైలర్ టీజర్ పేరుతో 40 సెకన్ల వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో పూనకాలు తెప్పిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 
ముఖ్యంగా, ఇందులో హీరో చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. "ఇందాక విన్నది భగవత్ గీత. ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" అంటూ పవన్ తనదైనశైలిలో చెప్పిన డైలాగ్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. 
 
"గబ్బర్ సింగ్" తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు, సినిమానలైప హైప్ పెంచగా, తాజా టీజర్ ఆ అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు వీడియోకు అదనపు బలంగా నిలిచింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో  శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 19వ తేదీన చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనుల చివరి దశలో ఉన్నాయ. వీటిని త్వరలోనే పూర్తి చేసి ట్రైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు.