సోమవారం, 16 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 19 ఫిబ్రవరి 2026 (09:43 IST)

DSP: ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో - పవన్ కు గిఫ్ట్ ఇది : దేవీశ్రీ ప్రసాద్

Ustad AURA song poster
Ustad AURA song poster
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను అదిరిపోయే ట్యూన్ తో పాటకు ఫ్యాన్స్ ఫిదా అయ్యేట్లు రూపొందించాననీ, ఇది పవన్ కు నివాళిగా వుంటుందని సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మీరు డీకోడ్ చేసి రాసినది మన ప్రియమైన పవర్ స్టార్ కి ఇచ్చే అతి పెద్ద నివాళిలో ఒకటి అవుతుంది అని తెలిపారు.
 
ఇటీవలే 2వ సాంగ్ షూట్ అయింది. చంద్రబోస్ రాసిన సాహిత్యంతో ఈ సాంగ్ తీశారు. మాస్ లో మంచి అంచనాలు ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ గా ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే సాంగ్ ఇప్పుడు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. రేపు అనగా శుక్రవారంనాడు సాంగ్ ప్రోమో విడుదలకాబోతుంది. పూర్తి సాంగ్ ను ఈనెల 22న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. 
 
శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్న ఈ చిత్రం మార్చ్ 26న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. హరీశ్ శంకర్ తనదైన శైలిలో పూర్తి ఎంటర్ టైన్ మెంట్ లో రూపొందిస్తూ చిన్న సామాజిక అంశాన్ని కూడా టచ్ చేసినట్లు తెలుస్తోంది.