1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Vadde Naveen didn't do movies out of passion: V.V. Vinayak

V.V. Vinayak: వడ్డే నవీన్‌ సినిమాలు ఇష్టంతో చేయలేదు : వి. వి. వినాయక్

Kamal Teja Narla, Vadde Naveen, Raasi Singh, V. V. Vinayak
Kamal Teja Narla, Vadde Naveen, Raasi Singh, V. V. Vinayak
వడ్డే నవీన్‌, రాశి సింగ్, శిల్పా తులస్కర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌కు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
 
వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.  ఈ కార్యక్రమంలో..
 
వి.వి. వినాయక్ మాట్లాడుతూ, వడ్డే నవీన్ చిత్రానికి అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా పని చేశాను. నవీన్‌ గారితో సినిమా చేస్తున్న టైంలోనే ‘ఆది’కి నాంది పలికినట్టు అయింది. ఆయన కెరీర్‌లోని 90 శాతం సినిమాలు మనస్పూర్తిగా ఇష్టంతో చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు. సినిమాల పట్ల ఆయనెప్పుడూ తృప్తిగా ఉండరు. ఓ సందర్భంలో ఆయన పరపతి చూసి షాక్ అయ్యాను. ఇకపై ఆయన తన మనసుకు నచ్చిన చిత్రాలే చేయాలని కోరుకుంటున్నాను. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
వడ్డే నవీన్ మాట్లాడుతూ, వినయ్ జర్నీ నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. మా కోసం వచ్చిన వినయ్‌కి థాంక్స్. సినిమా కోసం టీం అంతా ఇష్టపడి చేశారు. ఈ పదేళ్లలో టెక్నికల్ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మూవీలో కోర్ట్ డ్రామాతో పాటు సస్పెన్స్ బాగుంటుంది. ఏ ఫ్రైడే అయినా కూడా సింగిల్‌గా సినిమా రాలేదు. ఒకరితో పోటీ అని కాదు.. మూవీ బాగుంటేనే ఆడియెన్స్ చూస్తారు. ఈ చిత్రాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలానే చూసుకున్నాం. ఇందులోని కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మాకు జీ టీం కూడా సపోర్ట్ చేస్తోంది. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
డైరెక్టర్ కమల్ తేజ నార్ల మాట్లాడుతూ* .. ‘మా ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. టీజర్, ట్రైలర్‌ల కంటే సినిమా అద్భుతంగా ఉండబోతోంది. మా కోసం వచ్చిన వినాయక్ గారికి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. టీం అంతా ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశారు. జూన్ 19న సినిమాని చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
 
రాశీ సింగ్ మాట్లాడుతూ, మా టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. వడ్డే నవీన్ గారితో పాటు ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. అందరూ మా మూవీని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Bhogi: శర్వా.. భోగి చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సంపత్ నంది